Electric Vehicle | ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రియులకు తీపికబురు. మీరు కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే అదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. అందుబాటు ధరలోనే ఎలక్ట్రిక్ స్కూట్ లభిస్తోంది. ఇంకా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి.
2/ 10
వెర్సలైట్ ఇస్కూటర్ అనే ఎలక్ట్రిక్ ఈవీ స్టార్టప్ సూపర్ ఆఫర్ అందుబాటులో ఉంచింది. కేవలం రూ. 25,900కే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంటికి తీసుకెళ్లొచ్చు. కంపెనీ ఎస్ సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ ధరకే అందుబాటులో ఉంది.
3/ 10
మీరు రూ. 25,900 కాకుండా కేవలం రూ. 6,475 చెల్లించి కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంటికి తీసుకుపోవచ్చు. మిగతా మొత్తాన్ని ఈఎంఐ రూపంలో చెల్లిస్తే సరిపోతుంది. అది కూడా ఎలాంటి వడ్డీ లేకుండా లోన్ లభిస్తుంది.
4/ 10
క్రెడిట్ కార్డు కూడా ఉండాల్సిన పని లేదు. ఆన్లైన్లో కేవలం 2 నిమిషాల్లోనే ఈ ఎలక్ట్రిక స్కూటర్ కొనుగోలు చేయడానికి లోన్ లభిస్తుంది. అందువల్ల చేతిలో డబ్బులు లేకపోయినా కూడా మీరు ఈ ఎలక్ట్రిక స్కూటర్ ఇంటికి తీసుకెళ్లొచ్చు.
5/ 10
ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్ల విషయానికి వస్తే.. దీని టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. ఒక్కసారి చార్జ్ చేస్తే 15 కిలోమీటర్లు వెళ్లొచ్చు. గరిష్టంగా 100 కేజీల వరకు బరువును మోయగలదు. చార్జింగ్ టైమ్ 5 నుంచి 6 గంటలు పడుతుంది.
6/ 10
జీరో మెయింటెనెన్స్ దీని ప్రత్యేకత. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంటుంది. కంపెనీ ఇందులో 250 వాట్ మోటార్‌ను అమర్చింది. గ్రౌండ్ క్లియరెన్స్ 85 ఎంఎంగా ఉంది. ఒక్కసారి చార్జ్ చేయడానికి 0.5 యూనిట్ పవర్ ఖర్చు అవుతుంది.
7/ 10
ఇంకా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో బ్యాటరీ లెవెల్ ఇండికేటర్ ఉంటుంది. అలాయ్ వీల్స్ ఉన్నాయి. ఆల్ మెటల్ బాడీ. వాటర్ రెసిస్టెన్స్ మోటార్ అమర్చారు. ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఉంటుంది. ఇది ప్రస్తుతం బ్లూ, ఆరెంజ్ రంగుల్లో కస్టమర్లకు అందుబాటులో ఉంది.
8/ 10
మీరు ఈ ఎలక్ట్రిక వెహికల్ కొనుగోలు చేయాలని భావిస్తే.. కంపెనీ వెబ్సైట్లోకి వెళ్లి కొనొచ్చు. పేమెంట్ పేజ్‌లో రెండు ఈఎంఐ ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకటేమో మూడు నెలలు ఈఎంఐ ఆప్షన్. మరొకటి ఆరు నెలలు ఈఎంఐ ఆప్షన్.
9/ 10
మూడు నెలలు ఎంచుకుంటే నెలకు రూ. 6475 కట్టాలి. ఆరు నెలలు అయితే నెలకు రూ. 3238 చెల్లించాలి. ముందుగా అయితే రూ. 6475 చెల్లించాలి. లేదంటే ఒకేసారి రూ. 25 వేలు కట్టి ఈఎంఐ లేకుండా ఈ వెహికల్ కొనుగోలు చేయొచ్చు.
10/ 10
కాగా మార్కెట్లో చౌక ధరకే లభిస్తున్న ఇస్కూటర్ ఇదే అని చెప్పుకోవచ్చు. అందువల్ల మీరు కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ కోసం చూస్తూ ఉంటే.. దీన్ని ఒకసారి పరిశీలించొచ్చు. స్వల్ప దూర ప్రయాణాలకు ఇది అనువుగా ఉంటుంది.