1. భారతీయ రైల్వే రాబోయే మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లను పట్టాలెక్కించనుంది. ప్రస్తుతం ఉన్న ప్రీమియం రైళ్లు రాజధాని ఎక్స్‌ప్రెస్ (Rajdhani Express), శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కన్నా అద్భుతంగా వందేభారత్ రైళ్లు ఉండబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని అత్యుత్తమ రైళ్లలో కనిపించే సదుపాయాలను వందే భారత్ రైళ్లలో కల్పించనుందని ది టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. వందేభారత్ రైళ్ల వివరాలు చూస్తే 16 బోగీలు ఉన్న రైలులో 11 థర్డ్ ఏసీ కోచ్‌లు, 20 బోగీలు ఉన్న రైలులో 15 థర్డ్ ఏసీ కోచ్‌లు, 24 బోగీలు ఉన్న రైలులో 19 థర్డ్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. వీటితో పాటు 4 సెకండ్ ఏసీ కోచ్‌లు, ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. వందే భారత్ రైళ్లల్లో అన్ని బోగీలు ఏసీవే ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. అన్ని స్లీపర్ కోచ్‌లలో రీడింగ్ లైట్స్, బాటిల్ హోల్డర్, ప్రతి సీటుకు USB, ల్యాప్‌టాప్ కమ్ మొబైల్ ఛార్జింగ్ సాకెట్ లాంటి ఫీచర్స్ ఉంటాయి. థర్డ్ ఏసీలో నలుగురు ప్రయాణికులు, సెకండ్ ఏసీలో ప్రయాణికులు షేర్ చేసుకోవడానికి వీలుగా స్నాక్ టేబుల్స్ ఉంటాయి. ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లో ప్రతీ ప్యాసింజర్‌కు స్నాక్ టేబుల్ ఉంటుంది. ప్రతీ క్యాబిన్‌కు ఎల్సీడీ డిస్ప్లే కూడా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇతర ఫీచర్స్ చూస్తే టాయిలెట్లలో హెల్త్ ఫాసెట్, ఆటోమేటెడ్ టాయిలెట్ ఫ్లషింగ్, వాటర్ ట్యాప్‌తో వాష్ బేసిన్, ప్రతి కోచ్‌లో ఆటోమేటిక్ ఇంటర్నల్ డోర్స్, CCTV కెమెరా, GPS తో పనిచేసే ప్రయాణీకుల సమాచార వ్యవస్థ, Wi-Fi ద్వారా పనిచేసే ఆధారిత ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ప్రతి కోచ్‌లో డిస్ప్లే బోర్డులు, ప్రతి కోచ్ డోర్‌వే పైన రెండు అదనపు LED డిస్ప్లేలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)