5. అంటే మీరు ప్రతీ నెల ఏదైనా పేమెంట్ చేయాల్సి ఉంటే ఆటోపే ఫీచర్ ఎంచుకోవచ్చు. కస్టమర్లు ఇ-మ్యాండేట్ ద్వారా రూ.2,000 వరకు యూపీఐ ఆటో పే ఉపయోగించుకోవచ్చు. ఈ పేమెంట్స్కు యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ రూ.2,000 కన్నా ఎక్కువ చెల్లింపులకు ఆటో పే ఫీచర్ ఎంచుకుంటే మాత్రం కస్టమర్లు యూపీఐ పిన్ ఎంటర్ చేయల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. యూపీఐ ఆటో పే ఫెసిలిటీ ద్వారా కస్టమర్లు ఎలక్ట్రిసిటీ బిల్స్, ఫోన్ బిల్స్ చెల్లించొచ్చు. అంతే కాదు... అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ లాంటి ఓటీటీ సబ్స్క్రిప్షన్స్, మెట్రో పేమెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్యూరెన్స్, ఈఎంఐ పేమెంట్స్ లాంటివాటికోసం కూడా యూపీఐ ఆటో పే ఫీచర్ వాడుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ప్రతీ నెల, మూడు నెలలకోసారి, ఆరు నెలలకోసారి, ఏడాదికోసారి జరిపే చెల్లింపులకు కస్టమర్లు రిమైండర్లు సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఫెసిలిటీ వాడుకోవడానికి కస్టమర్లు యూపీఐ ఐడీ, క్యూఆర్ స్కాన్ ద్వారా ఇ-మ్యాండేట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఇ-మ్యాండేట్ క్రియేట్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేయొచ్చు. మాడిఫై చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)