Tata Car Offers: కారు కొనాలనుకునే వారికి శుభవార్త.. టాటా కార్లపై భారీ డిస్కౌంట్!
Tata Car Offers: కారు కొనాలనుకునే వారికి శుభవార్త.. టాటా కార్లపై భారీ డిస్కౌంట్!
Car Offers | కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఏకంగా భారీ తగ్గింపు పొందొచ్చు. రూ. 65 వేలు ఆదా చేసుకోవచ్చు.
Tata Motors | కొత్త కారు కొనేందుకు రెడీ అవుతున్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకంటే కార్లపై ఇప్పుడు భారీ డిస్కౌంట్ ఆఫర్లు లభిస్తున్నాయి. రూ.వేలల్లో డబ్బులు ఆదా చేసుకోవచ్చు. అందుకే కారు కొనే వారు ఈ ఆఫర్లను పొందొచ్చు. నవంబర్ నెలలో మాత్రమే ఈ డీల్స్ అందుబాటులో ఉంటాయి.
2/ 11
ప్రముఖ వాహన తయారీ కంపెనీల్లో ఒకటైన టాటా మోటార్స్ కార్లపై భారీ తగ్గింప ఆఫర్లు లభిస్తున్నాయి. ఏకంగా రూ. 65 వేల వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్లు ఈ నెలలో మాత్రమే ఉంటాయని గుర్తించుకోవాలి.
3/ 11
క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ వంటి వాటి రూపంలో కార్లపై తగ్గింపు లభిస్తోంది. టియాగో, టిగోర్, హరియర్, అల్ట్రోజ్, సఫారీ వంటి మోడళ్లపై డిస్కౌంట్ పొందొచ్చు.
4/ 11
కారు మోడల్, వేరియంట్ ప్రాతిపదికన తగ్గింపు మారుతుంది. అంతేకాకుండా డీలర్షిప్, ప్రాంతం ప్రాతిపదికన కూడా కారు ఆఫర్లలో మార్పు ఉంటుందని గుర్తించుకోవాలి. అందువల్ల ఆఫర్ వివరాల కోసం దగ్గరిలోని డీలర్షిప్ వద్దకు వెళ్లి సమాచారం తెలుసుకోవచ్చు.
5/ 11
టాటా సఫారీ కారుపై గరిష్టంగా డిస్కౌంట్ లభిస్తోంది. ఏకంగా రూ. 65 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. క్యాష్ డిస్కౌంట్ రూ. 30 వేల వరకు వస్తుంది. ఎక్స్చేంజ్ బోనస్ రూ. 30 వేల వరకు లభిస్తుంది. కార్పరేట్ డిస్కౌంట్ రూ. 5 వేలుగా ఉంది.
6/ 11
ఈ తగ్గింపు కజిరంగా, జెట్ వేరియంట్లకు వర్తిస్తుంది. అదే ఇతర వేరియంట్లపై అయితే రూ. 55 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. కంపెనీ ఇటీవలనే ఎక్స్‌ఎంఎస్, ఎక్స్ఎంఏఎస్ అనే వేరియంట్లకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
7/ 11
టాటా హరియర్ కారుపై కూడా ఇదే స్థాయిలో తగ్గింపు లభిస్తోంది. ఏకంగా రూ. 65 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇందులో కూడా ఎక్స్చేంజ్ బోనస్ రూ. 30 వేల వరకు, క్యాష్ డిస్కౌంట్ రూ. 30 వేల వరకు ఉంది. కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 5 వేలు పొందొచ్చు.
8/ 11
టాటా టిగోర్ కారుపై అయితే రూ. 45 వేల వరకు తగ్గింపు ఉంది. టిగోర్ సీఎన్జీ మోడల్‌కు ఇది వర్తిస్తుంది. ఇందులో రూ. 25 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ పొందొచ్చు. ఎక్స్చేజ్ బోనస్ రూ. 15 వేల వరకు వస్తుంది.
9/ 11
టాటా టియాగో సీఎన్జీ మోడల్‌పై కూడా రూ. 45 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. ఈ కారుపై కూడా రూ. 25 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంటుంది. రూ. 15 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ పొందొచ్చు. ఇక రూ.5 వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఉంది.
10/ 11
టాటా టిగోర్, టియాగో పెట్రోల్ వేరియంట్లపై అయితే రూ. 38 వేల వరకు డిస్కౌంట్ ఉంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ.20 వేల వరకు ఉంటుంది. ఎక్స్చేంజ్ బోనస్ రూ. 15 వేల వరకు వస్తుంది. ఇక కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 3 వేలు ఉంది.
11/ 11
టాటా అల్ట్రోజ్ కారుపై అయితే రూ. 23 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 10 వేలు వరకు వస్తుంది. ఎక్స్చేంజ్ బోనస్ కూడా రూ.10 వేల వరకు ఉంటుంది. ఇక కార్పొరేట్ తగ్గింపు రూ. 3 వేలు పొందొచ్చు.