Maruti Suzuki News | కారు కొనుగోలు చేయాలని భావించే వారికి అదిరిపోయే శుభవార్త. కారు కొనుగోలుపై భారీ తగ్గింపు ఆఫర్లు లభిస్తున్నాయి. ఏకంగా రూ. వేలల్లో డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ డీల్స్ గురించి తెలుసుకోవాల్సిందే.
2/ 9
దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ కార్లపై అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఏకంగా రూ. 57 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. నవంబర్ నెలలో మాత్రమే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని గుర్తించుకోవాలి.
3/ 9
ఎక్స్చేంజ్ ఆఫర్, క్యాష్‌బ్యాక్, కార్పొరేట్ బెనిఫిట్స్ వంటి వాటి రూపంలో మారుతీ కార్లపై తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్లు కారు మోడల్, ప్రాంతం, షోరూమ్ ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. అందువల్ల దగ్గరిలోని డీలర్షిప్ వద్దకు వెళ్లి ఆఫర్ వివరాలు తెలుసుకోండి.
4/ 9
అల్టో కే10 కారుపై అధిక డిస్కౌంట్ లభిస్తోంది. ఈ కారుపై రూ. 57 వేల తగ్గింపు పొందొచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 35 వేల వరకు ఉంటుంది. కార్పొరేట్ బెనిఫిట్ రూ. 7 వేల దాకా ఉంది. ఇక ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ. 15 వేల తగ్గింప పొందొచ్చు.
5/ 9
ఇంకా సెలెరియో కారుపై కూడా రూ. 56 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. కార్పొరేట్ బెనిఫిట్ రూ. 6 వేలు ఉంది. ఎక్స్చేంజ్ బోనస్ రూ. 15 వేల దాకా లభిస్తుంది. ఇక క్యాష్ డిస్కౌంట్ రూ. 35 వేల వరకు పొందొచ్చు.
6/ 9
అలాగే డిజైర్ మోడల్‌పై కూడా డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఈ కారుపై రూ. 32 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు లభిస్తున్నాయి. కార్పొరేట్ బెనిఫిట్ కింద రూ. 7 వేల దాకా తగ్గింపు ఉంది. క్యాష్ డిస్కౌంట్ రూ. 15 వేల దాకా పొందొచ్చు. ఇంకా ఎక్స్చేంజ్ బోనస్ రూ.10 వేల దాకా వస్తుంది.
7/ 9
ఎస్ప్రెసో కారుపై కూడా భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఈ కారుపై రూ. 56 వేల వరకు డిస్కౌంట్ ఉంది. రూ. 35 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ పొందొచ్చు. కార్పొరేట్ బెనిఫిట్ రూ. 6 వేల వరకు లభిస్తుంది. అలాగే ఎక్స్చేంజ్ బోనస్ రూ. 15 వేల దాకా పొందొచ్చు.
8/ 9
మారుతీ స్విఫ్ట్ కారుపై అయితే రూ. 30 వేల వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఇందులో 1.2 లీటర్ డ్యూయెల్ జెట్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 5 గేర్లు ఉంటాయి. మ్యానువల్, ఏఎంటీ వేరియంట్ల రూపంలో ఈ కారు లభిస్తుంది.
9/ 9
వ్యాగనార్ కారుపై కూడా డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఈ మోడల్‌పై రూ. 41 వేల వరకు తగ్గింపు ఉంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 20 వేల దాకా ఉంటుంది. కార్పొరేటు బెనిఫిట్ కింద రూ. 6 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. ఇక ఎక్స్చేంజ్ బోనస్ రూ. 15 వేల వరకు ఉంటుంది.