అలాగే ఇథనాల్, మిథనాల్, బయో-సీఎన్జీ, బయో-ఎల్ఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ‘15 సంవత్సరాలు పైబడిన తొమ్మిది లక్షలకు పైగా ప్రభుత్వ వాహనాలను స్క్రాప్ చేయాలని నిర్ణయించాం. కాలుష్యానికి కారణమయ్యే అన్-ఫిట్ బస్సులు, కార్లు రోడ్డెక్కవు. వాటి స్థానంలో ప్రత్యామ్నాయ ఇంధనాలతో కొత్త వాహనాలు వస్తాయి. దీని వల్ల వాయు కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది’ అని గడ్కరీ వెల్లడించారు.
* లేటెస్ట్ నోటిఫికేషన్ : ఈ విషయానికి సంబంధించి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి 15 సంవత్సరాల కంటే పాతవైన ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యంలోని బస్సులతో సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు.
రక్షణ విభాగం, శాంతిభద్రతల పర్యవేక్షణ, ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం ఉపయోగించే స్పెషల్ పర్సప్ వెహికల్స్(సాయుధ, ఇతర ప్రత్యేక వాహనాలు)కు ఈ రూల్ వర్తించదు. రిజిస్ట్రేషన్ అయిన తేదీ నుంచి 15 ఏళ్లు దాటిన ఇలాంటి వాహనాలను మోటార్ వెహికల్స్ (రిజిస్ట్రేషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ) రూల్స్-2021కు అనుగుణంగా ఏర్పాటు చేసిన రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్‌లో డిస్పోజ్ చేయాలని నోటిఫికేషన్ పేర్కొంది.