3. మన్మోహన్ సింగ్ | 1993 | ఈ బడ్జెట్లో గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ రుణాల గురించి విస్తృతంగా చర్చించారు. "మా వ్యూహం భారత పారిశ్రామిక రంగానికి అత్యధిక స్థాయిలో రక్షణ కల్పింస్తుంది. రైతులు చెల్లించాల్సిన అధిక పారిశ్రామిక ధరల్ని ఇది తగ్గిస్తుంది" బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి.
6. మన్మోహన్ సింగ్ | 1996 | 100 శాతం సురక్షితమైన తాగునీరు అందించడం, 100 శాతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి, ప్రాథమిక విద్య, పేదలకు ఇళ్ల నిర్మాణానికి ప్రోత్సాహం, మధ్యాహ్న భోజన పథకం అమలు, గ్రామాలకు రోడ్లు, దారిద్రరేఖకు దిగువన ఉన్నవారికి ప్రజా పంపిణీ వ్యవస్థను చేరువ చేయడం లక్ష్యంగా రూపొందిన బడ్జెట్ ఇది.
11. యశ్వంత్ సిన్హా | 2001 | ఆర్థిక రంగం, క్యాపిటల్ మార్కెట్లో సంస్కరణల కొ నసాగింపు, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడుల్ని ప్రోత్సహించడం లాంటివి ఈ బడ్జెట్లో కీలకంగా నిలిచాయి. అనుత్పాదక రంగంలో ఖర్చుల తగ్గింపు, సబ్సిడీల హేతుబద్ధీకరణ చేపట్టారు. ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేయడం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ని పునర్నిర్మించడం లాంటి చర్యలు తీసుకున్నారు.
13. జశ్వంత్ సింగ్ | 2003 | రోజుకు రూ.1 చొప్పున 365 రోజులకు వ్యక్తిగత ఆరోగ్య బీమా పథకాన్ని ప్రకటించింది ప్రభుత్వం. ఐదుగురు ఉన్న కుటుంబానికి రోజుకు రూ.1.50, ఏడుగురు ఉన్న కుటుంబానికి రోజుకు రూ.2 చొప్పున చెల్లించాలన్న నిబంధన ఉండేది. ఆస్పత్రిలో చేరితే రూ.30,000, చనిపోతే కుటుంబానికి రూ.25,000 ఈ పథకం కింద ప్రకటించారు.
14. జశ్వంత్ సింగ్ | 2004 | భారతదేశంలో నిరుపేదల సంఖ్య పెరిగింది. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 2 కోట్ల కుటుంబాలకు సబ్సిడీ ప్రకటించారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తొలగించి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 10% ప్రవేశపెట్టారు. ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలకు రూ.259 కోట్లు కేటాయించారు.
15. పి.చిదంబరం | 2005 | ఈ బడ్జెట్లో ప్రత్యక్ష పన్ను హైలైట్. రూ.1,00,000 వార్షికాదాయానికి పన్ను మినహాయింపు ఇచ్చారు. రూ.1-1.5 లక్షల వార్షికాదాయానికి 10%, రూ.1.5-2.5 లక్షల వార్షికాదాయానికి 20%, రూ.2.5 లక్షల ఆదాయానికి 30 శాతం పన్ను విధించారు. రహదారులకు నిధుల కోసం లీటర్ పెట్రోల్, డీజిల్పై 50 పైసల సెస్ విధించారు.