Union Budget 2023 | కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ తాజాగా బడ్జెట్ 2023ని ఆవిష్కరించింది. ఇందులో మోదీ సర్కార్ పలు కీలక ప్రకటనలు చేసింది. పన్ను మినహాయింపు లిమిట్ పెంపు దగ్గరి నుంచి సేవింగ్ స్కీమ్స్ వరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే మహిళలకు కొత్త స్కీమ్‌ను లాంచ్ చేసింది. వీటితో దిగుమతి సుంకాలను కూడా తగ్గించింది. అలాగే కొన్నింటిపై పెంచింది. దీని వల్ల ఏ ఏ వాటి ధరలు పెరుగుతాయో, వేటి ధరలు తగ్గుతాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.