3. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్‌కు సమయం ఆసన్నమవుతోంది. జనవరి 31న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లాంఛనంగా బడ్జెట్‌ను సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఊరట కలిగించే నిర్ణయం కేంద్రం తీసుకుంటుందని ఊహిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ముఖ్యంగా ఇన్‌కం ట్యాక్స్ శ్లాబ్ పరిమితిని పెంచుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకే పలుమార్లు ఈ విషయంపై కేంద్రానికి వేతన జీవులు బహిరంగంగానే విన్నవించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వివిధ శ్లాబుల్లో ఆదాయపన్ను కేంద్రం అమలు చేస్తోంది. రూ.2,50,000 వరకు వార్షిక ఆదాయం కలిగిన వారికి పన్ను మినహాయింపు ఇస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల లోపు ఆదాయం కలిగిన ఉద్యోగులను పన్ను చట్టం కిందకి తీసుకొస్తోంది. వీరికి 5 శాతం పన్నుని విధిస్తోంది. అయితే కొన్ని ప్రత్యేక మినహాయింపులు, ప్రోత్సాహకాల కారణంగా రూ.5 లక్షల వరకు వేతనం ఉన్న ఉద్యోగులు కూడా పన్ను చెల్లించకుండా రాయితీ పొందొచ్చని గతంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 87ఏ ఇందుకు సహకరింస్తుందని ఆయన వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. స్వాతంత్య్రం అనంతరం 1949-50 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇన్‌కం ట్యాక్స్ విధానాన్ని ప్రభుత్వం తొలిసారిగా తీసుకొచ్చింది. అప్పటి ఆర్థిక మంత్రి జాన్ మఠాయ్ ఈ విధానాన్ని ప్రకటించారు. అప్పుడు రూ.1,500కు పైగా వార్షిక వేతనం ఉన్నవారిని పన్ను పరిధిలోకి తీసుకొచ్చిందంటే ఆశ్చర్యం కలగక మానదు. వీరికి విధించే పన్ను రేటు ఎంతో తెలుసా? 4.69 శాతం. (ప్రతీకాత్మక చిత్రం)
7. రూ.1,500 నుంచి రూ.5000 వరకు ఉన్న వేతనజీవులకు 4.69 శాతం పన్నుని విధించింది. రూ.5 వేల నుంచి రూ.10 వేల లోపు ఆదాయం ఉన్నవారికి 10.94 శాతం పన్ను కేటాయించింది. రూ.10 వేల నుంచి రూ.15 వేలు సంపాదించే వారు.. వారి ఆదాయంలో 21.88 శాతం పన్నుగా చెల్లించాలని నిర్ణయించింది. అలాగే రూ.15 వేలకు పైబడిన వార్షిక వేతనం కలవారు 31.25 శాతం పన్ను చెల్లించాలని షరతు విధించింది. (ప్రతీకాత్మక చిత్రం)
8. స్వాతంత్య్రం వచ్చాక తొలి బడ్జెట్‌ను మాత్రం అప్పటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం శెట్టి ప్రవేశపెట్టారు. 1947, నవంబరు 26న బడ్జెట్‌ని తీసుకొచ్చారు. అయితే, పన్ను శ్లాబులను క్రమక్రమంగా కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ వచ్చింది. చివరగా 2014లో పన్ను శ్లాబులను సవరించింది. ప్రస్తుతం పన్ను శ్లాబుల వివరాలు ఇలా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)