1. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2023 లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పలు వరాలు కురిపించనుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని కొందరి సమాచారం ప్రకారం ఉద్యోగుల జీతాల కోసం ఫిట్మెంట్ అంశాన్ని మార్చే అవకాశం ఉంది. దీంతో పాటు హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్‌ను రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 2024 ఎన్నికల ముందు ఇదే చివరి బడ్జెట్. కాబట్టి ఈ బడ్జెట్లో అనేక వర్గాలకు వరాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వరాలు ఉండబోతున్నాయి. ఉద్యోగులకు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ప్రస్తుతం ఉమ్మడి ఫిట్మెంట్ విలువ 2.57 శాతం. బేసిక్ వేతనంపై దీన్ని లెక్కిస్తారు. ఉదాహరణకు రూ.15,500 బేసిక్ వేతనం ప్రకారం తీసుకుంటే రూ.39,835 ఫిట్మెంట్ లభిస్తుంది. ఆరో పే కమిషన్ ఫిట్మెంట్ రేషియో 1.86 శాతంగా ఉంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను 3.68కి పెంచాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారని సమాచారం. అదే జరిగితే కనీస వేతనం రూ.18,000 నుంచి రూ.26,000 కి పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)