1. సరికొత్త జనరేషన్లో 400 వందే భారత్ రైళ్లను (Vande Bharat Train) మరో మూడేళ్లలో తయారుచేయబోతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తమ నాలుగు ప్రాధమ్యాల్లో పీఎం గతిశక్తి, సమ్మిళిత అభివృద్ధి, ఉత్పాదకత పెంపుదల, పెట్టుబడి లాంటివి ఉన్నాయని ప్రకటించారు. రైళ్ల భద్రత, సామర్థ్యం పెంపొందించడం కోసం 2,000 కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్‌ను స్వదేశీ సాంకేతిక అయిన కవచ్ కిందకు తీసుకొస్తామన్నారు. (image: Indian Railways)
2. అందులో భాగంగా రాబోయే 3 ఏళ్లలో మెరుగైన సామర్థ్యంతో 400 కొత్త తరం వందే భారత్ రైళ్లను తీసుకొస్తామన్నారు. భారతీయ రైల్వే ఇప్పటికే వందే భారత్ రైళ్లను నడుపుతోంది. వీటిని దేశంలోని అన్ని ప్రధాన రూట్లలో నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత ప్రభుత్వానికి చెందిన చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వందే భారత్ రైళ్ల తయారీ 2018 లోనే ప్రారంభమైంది. (image: Indian Railways)
3. తొలి వందే భారత్ రైలు 2019 ఫిబ్రవరి 15న ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో రెండు వందే భారత్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఢిల్లీ-వారణాసి, ఢిల్లీ-కాట్రా రూట్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఈ ఏడాది మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. (image: Indian Railways)
4. ఈ ఏడాది మార్చి 31 లోగా మూడో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను నడపాలని ఇప్పటికే భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. మూడో వందే భారత్ రైలు ఏ రూట్లో అందుబాటులోకి రానుందో ఇంకా తెలియదు. దేశంలోని 40 పట్టణాలను కలుపుతూ వందే భారత్ రైళ్లను నడుపుతామని ఇప్పటికే భారతీయ రైల్వే ప్రకటించిన సంగతి తెలిసిందే. (image: Indian Railways)
5. 2024 నాటికి వందకు పైగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతామని భారతీయ రైల్వే గతంలోనే ప్రకటించింది. అయితే ప్రస్తుతం బడ్జెట్లో మరో మూడేళ్లలో 400 వందే భారత్ ట్రైన్స్ తయారు చేస్తామని ప్రకటించడం విశేషం. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు చెన్నైలో ఉన్న ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీతో పాటు రాయ్‌బరేలీలోని మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ, కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి. (image: Indian Railways)
6. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారతదేశంలో మొదటి సెమీ హైస్పీడ్ ట్రైన్. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైళ్లు శతాబ్ధి, రాజధాని ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ కన్నా వేగంగా ప్రయాణిస్తాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఏ రూట్లో అయినా ముందుగా ప్రోటోటైప్ రైళ్లను ప్రయోగాత్మకంగా నడుపుతారు. (image: Indian Railways)