1. కేంద్ర ప్రభుత్వం ఎప్పట్లాగే ఈ బడ్జెట్లో కూడా రైతులకు ముఖ్యమైన ప్రకటనలు చేసింది. పార్లమెంట్లో నాలుగోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైతులకు కనీస మద్దతు ధరపై ప్రకటనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వరి, గోధుమ, పప్పుదినుసులు, నూనెగింజలకు కనీస మద్దతు ధర ఇస్తుందన్న సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
2. రబీలో గోధుమలు, ఖరీఫ్‌లో వరి సేకరించేందుకు నిధులు కేటాయించినట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. 163 లక్షల రైతుల నుంచి 1208 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు, వరి సేకరిస్తున్నామని, వారికి కనీస మద్దతు ధర ప్రకారం రూ.2.37 లక్షల కోట్లు జమ చేస్తామని తెలిపారు. రైతులు పండించే ఈ పంటలకు కనీస మద్దతు ధర ఎంత ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. (image: News18 Creative)
3. ఇక వ్యవసాయంలో రసాయనాల వినియోగం తగ్గించేందుకు సహజ వ్యవసాయ పద్ధతుల్ని ప్రోత్సహిస్తామన్నారు. ఇప్పటికే సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేసేవారికి మద్దతు లభించనుంది. మొదటి దశలో గంగానది ఒడ్డున ఉన్న ప్రాంతాల్లో అమలు చేస్తామన్నారు. మొదటి దశలో ఐదు కిలోమీటర్ల కారిడార్‌ను ఎంపిక చేయనున్నారు. (image: News18 Creative)
5. ఇక ఆయిల్ విత్తనాల దిగుమతి తగ్గించేందుకు స్థానికంగానే నూనెగింజల ఉత్పత్తిని చేసేలా పథకాన్ని తీసుకురానున్నారు. హైటెక్, డిజిటల్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇందుకోసం ప్రైవేట్ అగ్రిటెక్ ప్లేయర్స్‌తో పీపీపీ పద్ధతిలో ప్రాజెక్టులు చేపట్టబోతున్నామన్నారు. చిన్న రైతులు, ఎంఎస్ఎంఈల కోసం భారతీయ రైల్వే సరికొత్త ఉత్పత్తుల్ని తయారు చేయనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. వ్యవసాయంలో కిసాన్ డ్రోన్స్ ఉపయోగించేందుకు అనుమతి ఇస్తున్నామని తెలిపారు. పోషకాలు, పురుగుమందులు చల్లడానికి డ్రోన్లు ఉపయోగించుకోవచ్చు. ఇక నాబార్డ్‌తో రైతులకు ఆర్థిక చేయూత అందిస్తామని కూడా తెలిపారు. కెన్ బెత్వా నది లింకింగ్ ప్రాజెక్ట్‌కు రూ.44,605 కోట్లు ప్రకటించారు. మరో ఐదు నదుల్ని లింక్ చేసేందుకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డ్రాఫ్ట్ ఫైనలైజ్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇక ఆధునిక వ్యవసాయ పద్ధతులను దృష్టిలో పట్టుకొని అగ్రికల్చర్ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు సిలబస్‌లో మార్పులు చేసేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని నిర్మలా సీతారామన్ కోరారు. వ్యవసాయానికి అనుబంధంగా పనిచేసే అగ్రికల్చర్ స్టార్టప్స్‌కు, రూరల్ ఎంటర్ప్రెజెస్కు ఆర్థికంగా ప్రోత్సాహం కల్పిస్తున్నామని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)