Union Budget 2021: పీఎం కిసాన్ సాయం పెంచే ఆలోచనలో కేంద్రం... బడ్జెట్‌లో రైతులపై వరాలు

Union Budget 2021 | మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలపై రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌లో మరిన్ని వరాలు కురిపించేందుకు మోదీ ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్న వార్తలొస్తున్నాయి. ఈసారి పీఎం కిసాన్ పథకం ద్వారా అందించే ఆర్థిక సాయాన్ని పెంచే అవకాశం ఉంది.