Union Budget 2019: బడ్జెట్లో ఈ కీలక రంగాలకు అత్యధిక ప్రాధాన్యత
Union Budget 2019: బడ్జెట్లో ఈ కీలక రంగాలకు అత్యధిక ప్రాధాన్యత
Union Budget 2019 | బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కసరత్తు ప్రారంభించారు. ఈ కీలక అంశాలపై బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రత్యేక దృష్టిసారించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జులై 5న లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మోదీ 2.0 సర్కారు తొలి బడ్జెట్ కావడంతో ఈ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది.
2/ 9
ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో మందగించిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందున్న ప్రధాన ఛాలెంజ్.
3/ 9
బ్యాంకింగ్ రంగంలో మొండి మొకాయిల సమస్యపై బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రత్యేక దృష్టిసారించనున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశముంది.
4/ 9
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ద్రవ్య కొరతపై కూడా నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రత్యేక దృష్టిసారించనున్నారు.
5/ 9
నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా ఉద్యోగాల సృష్టికి బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రత్యేక దృష్టిసారించనున్నారు.
6/ 9
ప్రైవేటు పెట్టుబడులను పెంచడంతో పాటు ఎగుమతులకు ఊతమిచ్చేలా బడ్జెట్లో ప్రత్యేక రాయితీలు కల్పించే అవకాశముంది.
7/ 9
వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేసేందుకు నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
8/ 9
ద్రవ్యలోటుపై ఒత్తిడి పెరగకుండా ప్రభుత్వ వ్యయాలు పెంచేందుకు బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి ప్రాధాన్యమివ్వనున్నారు.
9/ 9
మోడీ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్టీని మరింత సరళతరం చేయడంపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టిసారించనున్నారు.