కార్పొరేట్ ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ (Group Insurance) ఉండటం సహజం. సాధారణంగా సంస్థలు ఉద్యోగి మొత్తం శాలరీ ప్యాకేజీ లేదా ఉద్యోగి కాస్ట్-టు-కంపెనీ (CTC)లో బీమా ప్రీమియంను యాడ్ చేస్తుంటాయి. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్, గ్రూప్ టర్మ్ లైఫ్.. గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ సహా అనేక గ్రూప్ ప్లాన్లకు ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం కేటాయిస్తాయి.
గ్రేడ్ల ఆధారంగా ఇన్సూరెన్స్ బెనిఫిట్స్
చాలా కంపెనీలు ముందుగా నిర్ణయించిన అర్హత ప్రమాణాల ఆధారంగా ఉద్యోగులకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అందిస్తాయి. అందువల్ల ఉద్యోగులు నిబంధనల గురించి పూర్తిస్థాయిలో తెలుసుకొని తమ అర్హత ప్రమాణాలకు అనుగుణంగా బెనిఫిట్స్ వర్తిస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
* గ్రూప్ లైఫ్, యాక్సిడెంట్ కవర్స్‌కి శాలరీతో ఉన్న లింక్ ఏంటి?
యాక్సిడెంట్, లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ విషయంలో ప్రతి హోదాకు సమ్ అష్యూర్డ్(SA) నిర్ణయిస్తారు. ఫీల్డ్ లెవెల్ సిబ్బందికి రూ.10 లక్షల SA కేటాయిస్తే.. సీనియర్ మేనేజ్మెంట్కు రూ.1 కోటి SA అలోకేట్ చేస్తారు. యాక్సిడెంట్, లైఫ్ ఇన్సూరెన్స్ కోసం ఇన్సూరెన్స్ కంపెనీలు SAని ఒక ఉద్యోగి వార్షిక శాలరీ ప్యాకేజీ కంటే 10 రెట్లు మించకూడదని నిర్ణయించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
యాక్సిడెంట్, లైఫ్ ఇన్సూరెన్స్ కోసం SAను ఒక వ్యక్తి CTCకి లింక్ చేయడం అనేది సర్వసాధారణం. జీతానికి తగ్గట్టుగా SA రానప్పుడు లేదా జీతం పెరిగి SA అలాగే ఉన్నప్పుడు ఈ విషయం హెచ్ఆర్కి చెప్పాల్సి ఉంటుంది. కొన్ని కంపెనీలు SAని వాస్తవ జీతానికి లింక్ చేయకుండా కంపెనీ ఉద్యోగులందరినీ పే బ్యాండ్‌గా వర్గీకరించి.. బ్యాండులగా వారీగా SAని కేటాయించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)