అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు, ముఖ్యంగా వృద్ధులకు ఆదాయ భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన(Atal Pension Yojana) పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని 2015 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఆ తర్వాత 2015 మే 9న కోల్‌కతాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ స్కీమ్‌ను ప్రారంభించారు. వీటితో పాటు మరో రెండు స్కీంలను కూడా ప్రారంభించారు. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన, ప్రధాన మంత్రి సరక్ష బీమా యోజన వంటి బీమా పథకాలను ప్రారంభించారు. ఇటీవల వీటి ప్రీమియం చార్జీలను కూడా పెంచారు. ఇక అటల్ పెన్షన్ యోజన విషయానికి వస్తే.. పదవీ విరమణ అనంతర జీవితం కోసం స్వచ్ఛందంగా పొదుపు చేసుకునేలా ఈ స్కీం ప్రోత్సహిస్తోంది. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసు గల భారతీయ పౌరులెవరైనా.. ఈ స్కీమ్ కింద తమ పేరును నమోదు చేసుకునే అర్హత ఉంటుంది.
(ప్రతీకాత్మక చిత్రం)
60 ఏళ్లు వయసు నిండిన నాటి నుంచి ఈ స్కీమ్ కింద నెలకు రూ. 1000 నుంచి రూ.5000 కనీస పింఛనుకు ఇది హామీ ఇస్తుంది. పై మూడు పథకాల్లో ఎక్కువగా అటల్ పెన్షన్ యోజన కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న పథకాలలో బాగా పాపులర్ అయింది. 2021-22లో ఈ స్కీమ్‌లో 64 లక్షల మంది చేరారు. ఇప్పటికే ఈ స్కీమ్‌లో చేరిన వారి సంఖ్య 4కోట్లుగా నమోదు కావడం విశేషం.
(ప్రతీకాత్మక చిత్రం)
ఈ స్కీమ్‌లో భార్యాభర్తలు ఇద్దరూ చేరొచ్చు. ఇద్దరికీ 60 ఏళ్ల వయసు నుంచి నెలకు రూ.5 వేల చొప్పున పెన్షన్ వస్తుంది. అంటే భార్యాభర్తలు ఇద్దరూ ఈ స్కీమ్ ద్వారా నెలకు రూ.10 వేల పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. వయసు ఎంత తక్కువగా ఉన్నప్పుడు ఈ స్కీమ్‌లో చేరి, పొదుపు చేస్తే అంత ఎక్కువ లాభం వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
అటల్ పెన్షన్ యోజనలో 18 ఏళ్లు ఉన్నప్పుడు చేరితే నెలకు రూ.42 నుంచి రూ.210 వరకు కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. వయసు పెరుగుతున్న కొలది ఈ మొత్తం పెరుగుతూ ఉంటుంది. అటల్ పెన్షన్ స్కీమ్ కింద కనీసం 20 ఏళ్లు కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. నెలవారీ, క్వార్టర్లీ, అర్థ వార్షికం చొప్పున పెన్షన్ స్కీమ్‌లో కంట్రిబ్యూషన్స్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
అప్లికేషన్ ఫామ్‌ను నింపిన తర్వాత.. బ్యాంకు వద్ద ఈ ఫామ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. వాలిడ్ మొబైల్ నెంబర్ తో పాటు.. ఆధార్ కార్డు ఫోటోకాఫీని కూడా ఇవ్వాలి. అప్లికేషన్ అప్రూవల్ అయిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. రూ.1000 పింఛన్ రావాలంటే.. నెలకు రూ.42 కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)