మన దేశంలో సాధారణ ప్రజల పొదుపు అలవాటును పెంపొందించేకు అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. వివిధ రకాల సేవింగ్స్ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టి, నిర్ణీత రాబడి పొందే అవకాశం ఉంది. ఈ లిస్ట్‌లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ (SCSS) వంటి చిన్న పొదుపు పథకాలకు మంచి ఆదరణ ఉంటుంది.
ఎస్బీఐ ఉత్సవ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్, కార్డ్ టోకెనైజేషన్ ప్రాసెస్, టోకెనైజేషన్, ధర, నేషనల్ పెన్షన్ సిస్టమ్ నామినేషన్" width="1200" height="800" /> ప్రభుత్వ మద్దతు ఉండటం, మార్కెట్ రిస్క్ లేకపోవడంతో వీటిలో ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ పథకాల్లో పెట్టిన పెట్టుబడులను ఏదైనా కారణంతో క్లెయిమ్ చేయకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
వివిధ పెట్టుబడి పథకాలు, బీమా లేదా డిపాజిట్లపై అన్- క్లెయిమ్డ్ ఫండ్‌ను మేనేజ్ చేయడానికి వివిధ ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. అన్ క్లెయిమ్డ్స్ ఇన్సూరెన్స్, PPF లేదా EPF మొత్తం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్(SCWF)కు ట్రాన్స్ఫర్ అవుతుంది. క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్లు డిపోసర్ అండ్ అవేర్నెస్ ఫండ్ (DEAF)కు మూవ్ అవుతుంది.
(ప్రతీకాత్మక చిత్రం)
ఎలా ట్రాక్ చేయాలి?
లబ్ధిదారులు తమ అన్ క్లెయిమ్డ్ PPF, EPF లేదా ఏదైనా ఇతర పథకాల నిధులను ఇండియా పోస్ట్ వెబ్సైట్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. దీనికోసం లబ్ధిదారులు ముందు పోస్టల్ విభాగం అధికారిక వెబ్సైట్ www.indiapost.gov.in/కు లాగిన్ అయ్యి, హోమ్ పేజీలో కనిపించే బ్యాంకింగ్ అండ్ రెమిటెన్స్ పై క్లిక్ చేయాలి.
ఇప్పుడు ఓపెన్ అయ్యే కొత్త పేజీలో ‘పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్’ ఆప్షన్‌పై క్లిక్ చేసి, రిజల్ట్స్ నుంచి ‘సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్’ను సెలక్ట్ చేయాలి. ఇక్కడ మీ అకౌంట్ రకాన్ని సెలక్ట్ చేయాలి. అంటే లబ్ధిదారులు ఇన్వెస్ట్ చేసిన స్కీమ్ ఏదో (కిసాన్ వికాస్ పత్ర, PPF, సేవింగ్స్ బ్యాంక్ లేదా మరేదైనా స్కీమ్) ఎంచుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
చిన్న పొదుపు పథకాల నిధుల విషయంలో..
2015లో ఏర్పాటైన SCWFలోకి PPF, EPF, రికరింగ్ డిపాజిట్ అకౌంట్స్, పోస్టాఫీస్ సేవింగ్ అకౌంట్స్ వంటి ఇతర అన్‌క్లెయిమ్స్ డిపాజిట్ ఫండ్స్‌ను హోల్డ్ చేస్తుంది. అయితే క్లెయిమ్ చేయని డబ్బును SCWFకి బదిలీ చేయడానికి ముందు ప్రభుత్వం కచ్చితంగా లబ్ధిదారులను సంప్రదించడానికి ప్రయత్నిస్తుంది.