Petrol Price: బిగ్ షాక్.. యుద్ధంతో మనకూ దెబ్బే..భారత్‌లో భారీగా పెరగనున్న పెట్రోల్ రేట్లు!
Petrol Price: బిగ్ షాక్.. యుద్ధంతో మనకూ దెబ్బే..భారత్‌లో భారీగా పెరగనున్న పెట్రోల్ రేట్లు!
Petrol Price: ఉక్రెయిన్, రష్యా యుద్ధ ప్రభావం మనపైనా తీవ్రంగా పడబోతోంది. పెట్రోల్ ధరలు భారీగా పెరగనున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఇంధన ధరల మోత మోగనున్నట్లు తెలుస్తోంది? మరి ఎప్పటి నుంచి పెరుగుతాయి? ఎంత భారం పడుతుంది?
ఉక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలన్నింటిపై బాంబులు వేస్తూ రష్యా బీభత్సం సృష్టిస్తోంది. ఈ క్రమంలో రష్యాపై అమెరికా, నాటో, ఈయూ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. తద్వారా ఎగుమతులపై ప్రభావ పడి.. పలు వస్తువుల ధరలు పెరుగుతాయి. వాటిలో పెట్రోల్ కూడా ఉంది.
2/ 8
రష్యాపై చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. తద్వారా ఆ దేశం నుంచి ఎగుమతయ్యే వస్తువులు నిలిచిపోనున్నాయి. ఇక ఉక్రెయిన్ మొత్తం ఛిన్నాభిన్నమైంది. అక్కడి నుంచి కూడా ఏ ఉత్పత్తులు బయటకు వెళ్లే పరిస్థితులు ప్రస్తుతానికి లేవు.
3/ 8
యుద్ధం కారణంగా రష్యా నుంచి పెట్రోల్ ఎగుమతులు నిలిచిపోయాయి. తద్వారా డిమాండ్‌కు తగ్గ సరఫరా కావడం లేదు. ఫలితంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే బ్యారెల్ ముడి చమురు ధర 117 డాలర్లు దాటేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
యుద్ధం ప్రారంభమై నేటికి ఎనిమిదో రోజు. ఈ వారం రోజుల్లోనే ముడి చమురు ధరలు 20శాతం పెరిగాయి. రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశముందని నిపుణులు అభిప్రాయడుతున్నారు. దీని ప్రభావం మనపైనా పడనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
ప్రస్తుతం మనదేశంలో చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ.100 దాటాయి. తెలంగాణ ఏపీలో రూ.110కి చేరువలో ఉన్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగుతుండడంతో... త్వరలో మనదేశంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయని నిపుణులు అభిప్రాయడపడుతున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
మనదేశంలో పెట్రోల్ ధరలు చాలా రోజులుగా స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుండడంతో ప్రభుత్వం ధరలను పెంచే సాహసం చేయడం లేదు. ఎన్నికలు ముగిసిన వెంటనే.. పెట్రోల్ ధర మోగడం ఖాయంగా కనిపిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
మరో వారం రోజుల్లోనే పెట్రోల్ ధరల మోత ప్రారంభయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధరలు క్రమంగా పెరుగుతూ.. లీటర్ పెట్రోల్ రూ.120 వరకు చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముడి చమురు ధర ఇంకా పెరిగితే.. మన దేశంలో పెట్రోల్ ధరలు మరింత పెరిగే అకాశముంది.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
రష్యా యుద్ధం కారణంగా పెట్రోల్ మాత్రమే కాదు.. సన్‌ఫ్లవర్ నూనె, ఎరువులు, బొగ్గు, సహజవాయువు, అల్యూమినియం ధరలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)