1. ఆధార్ నెంబర్లో 12 అంకెలు ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే 12 అంకెలు ఉన్నంతమాత్రాన అది ఆధార్ నెంబర్ కాదంటోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI. ఉదాహరణకు ఎవరిదైనా ఐడీ ప్రూఫ్ కోసం ఆధార్ నెంబర్ తీసుకున్నట్టైతే ఆ ఆధార్ నెంబర్‌ను వెరిఫై చేయాలని యూఐడీఏఐ కోరుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. నెంబర్లో 12 అంకెలు ఉన్నంత మాత్రానా అది ఆధార్ నెంబర్ కాదని, ఈ తరహా ఆధార్ మోసాలు జరుగుతున్నాయని యూఐడీఏఐ అప్రమత్తం చేస్తోంది. ఎవరైనా ఐడీ ప్రూఫ్‌గా ఆధార్ నెంబర్ ఇస్తే ఆ నెంబర్‌ను వెరిఫై చేయాలని కోరుతోంది. https://uidai.gov.in/ లేదా https://resident.uidai.gov.in/ వెబ్సైట్లలో ఆధార్ నెంబర్ వెరిఫై చేయొచ్చు. మరి ఆధార్ నెంబర్‌ను ఎలా వెరిఫై చేయాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఆధార్ కార్డ్ హోల్డర్లు తమ ఆధార్ నెంబర్‌ను కూడా ఇలాగే వెరిఫై చేయొచ్చు. తమ ఆధార్ నెంబర్ యాక్టీవ్‌లో ఉందా లేదా అన్న విషయం తెలుసుకోవచ్చు. ఆన్లైన్లోనే కాదు... ఆఫ్‌లైన్‌లో కూడా ఆధార్ నెంబర్ యాక్టీవ్‌గా ఉందో లేదో వెరిఫై చేయొచ్చు. ఇందుకోసం ఆధార్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు. (ప్రతీకాత్మక చిత్రం)