ప్రభుత్వ రంగానికి చెందిన యూకో బ్యాంక్ అదరగొట్టింది. టాప్ పర్ఫార్మర్గా నిలిచింది. ఈ షేరు ఈ ఏడాది ఇప్పటి వరకు 180 శాతం మేర పెరిగింది. అంటే ఏడాది ఆరంభంలో రూ.లక్ష పెట్టి ఉంటే ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ విలువ రూ.2.8 లక్షలకు చేరి ఉండేది. 52 వారాల కనిష్ట స్థాయి నుంచి చూస్తే ఏకంగా 262 శాతం మేర పైకి కదిలింది. ఈ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ. 43,519 కోట్లు.