Business Ideas: ఈ రోజుల్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అందువల్ల ప్రజలు క్రమంగా... ప్లాస్టిక్ స్థానంలో... ప్రత్యామ్నాయ వస్తువులు వాడుతున్నారు. ఇళ్లలో కావాల్సిన సామాన్లనే తీసుకుంటే... ప్లాస్టిక్ గిన్నెలు, స్పాచులాల బదులు... చెక్కతో తయారుచేసిన గిన్నెలు, గరిటెలను వాడుతున్నారు. అవైతే ఆరోగ్యానికి మంచివి కావడంతో... వాటికి ఆదరణ బాగా పెరుగుతోంది. (image credit - https://ediblepro.com)
ఇలా తినదగ్గ వస్తువుల్ని గమనిస్తే వాటిలో... చెంచాలు, కత్తులు, ఫోర్కులు, గిన్నెలు, ప్లేట్లు, కప్పులు వంటివి ఉన్నాయి. వీటిని వంటల్లో వాడుకోవచ్చు. ఆహార పదార్థాలు వేసుకొని తినవచ్చు. ఆ తర్వాత వీటినే తినేయవచ్చు. వేడి వేడి టీ, కాఫీ, కూల్‌డ్రింకులను కూడా వీటిలో పోసుకొని తాగవచ్చు. (image credit - https://ediblepro.com)