తెలంగాణలో అతిపెద్ద పండుగలు అయిన బతుకమ్మ, దసరా సంబరాలు (Dussehra 2022) రానే వచ్చాయి. పండుగను సొంతూళ్లలో జరుపుకోవడానికి ప్రజలు పట్టణాల నుంచి భారీగా తరలివెళ్లనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) మహానగరం నుంచి ప్రజలు భారీగా గ్రామాలకు, సొంత ప్రాంతాలకు తరలి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ (TSRTC) కీలక ప్రకటన చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
పండుగ సందర్భంగా ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది ఆర్టీసీ. 30 కంటే ఎక్కువ మంది ఒకే ప్రాంతానికి వెళ్లే వారు ఉంటే ప్రయాణికులు ఉన్న చోటుకే బస్సు పంపించనున్నట్లు వెల్లడించింది. కాలనీల్లో నివాసం ఉండే ఒకే ప్రాంతానికి చెందిన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ సూచించింది. (ప్రతీకాత్మక చిత్రం)