సంక్రాంతి పండుగకు సొంతూరుకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య 4,233 స్పెషల్ బస్సులను నడపనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ బస్‌భవన్ నుంచి శుక్రవారం రాష్ట్రంలోని ఆర్టీసీ అధికారులతో సజ్జనార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. (ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణ సంక్రాంతి స్పెషల్ బస్సులు" width="1600" height="1600" /> ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాది సంక్రాంతికి 3,736 ప్రత్యేక బస్సులు నడిపినట్లు చెప్పారు. అయితే.. ఈ ఏడాది ఆ సంఖ్యను పది శాతం పెంచినట్లు వివరించారు. సంక్రాంతి స్పెషల్ బస్సులు జనవరి 7 నుంచి 15వ తేదీ వరకు వరకు అందుబాటులో ఉంటాయన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)