TS Jobs | TSRTC: నిరుద్యోగ యువతకు తెలంగాణ ఆర్టీసీ బంపరాఫర్.. 20 శాతం తగ్గింపు.. వివరాలివే
TS Jobs | TSRTC: నిరుద్యోగ యువతకు తెలంగాణ ఆర్టీసీ బంపరాఫర్.. 20 శాతం తగ్గింపు.. వివరాలివే
ప్రభుత్వ ఉద్యోగాలకు (Government Jobs) ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనతో తెలంగాణలో ప్రస్తుతం కొలవులు జాతర సాగుతోంది. నిరుద్యోగ యువకులందరూ పుస్తకాలతో హైదరాబాద్ నగర బాట పట్టారు. దీంతో మహానగరంలోని కోచింగ్ సెంటర్లన్నీ కిటకిటలాడుతున్నాయి.
2/ 5
ఇలాంటి నిరుద్యోగ యువతీ యువకులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ లపై 20 శాతం తగ్గింపు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
3/ 5
దరఖాస్తుకు సంతకం చేసిన ఆధార్ జిరాక్స్ లేదా కోచింగ్ సెంటర్ ఐడీ కార్డు జిరాక్స్ లేదా నిరుద్యోగ గుర్తింపు కార్డును జత చేసి అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.
4/ 5
ఆఫర్ పై జీబీటీ ఆర్డినరీ పాసును రూ. 2,800లకు, జీబీటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్‌ను రూ. 3,200లకు అందించనున్నారు.
5/ 5
నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటన విడుదల చేశారు.