తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ పండుగను సొంతూళ్ల జరుపుకోవాలని అంతా భావిస్తుంటారు. దీంతో కొన్ని నెలల ముందే సంక్రాంతికి సమయానికి సంబంధించి టికెట్లను బుక్ చేసుకుంటూ ఉంటారు.
2/ 6
ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ట్రైన్ టికెట్లు దొరకడం చాలా కష్టం. నెలల ముందే టికెట్లు బుక్ అయి పోతూ ఉంటాయి. ఈ సారి కూడా అదే పరిస్థితి తలెత్తింది. ట్రైన్ టికెట్లు అన్నీ బుక్ కావడంతో స్పెషల్ ట్రైన్లవైపే ప్రయాణికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
3/ 6
ఇప్పటివరకు అయితే.. ఇండియన్ రైల్వే ఎలాంటి స్పెషల్ ట్రైన్లను ప్రకటించలేదు. అయితే.. రానున్న వారం పది రోజుల్లో స్పెషల్ ట్రైన్లకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
4/ 6
ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ పండుగకు సొంత ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్న వారికి శుభవార్త చెప్పింది. గురువారం నుంచి సంక్రాంతికి సబంధించిన రిజర్వేషన్లను ప్రారంభించింది.
5/ 6
ఈ స్పెషల్ సర్వీసులకు ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని ఆర్టీసీ అధికారులు తెలిపారు. పండుగకు సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్న వారు సురక్షితమైన ప్రయాణం కోసం ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
6/ 6
ప్రయాణికులు ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ https://www.tsrtconline.in/ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించారు.