శబరిమల వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. వారి కోసం డిస్కౌంట్ లో ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచుతున్నట్లు చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
అయ్యప్ప స్వామి భక్తులు ప్రైవేటు సంస్థల బస్సులను ఆశ్రయించి నష్టపోకుండా, సురక్షితమైన ప్రయాణాన్ని ఆర్టీసీ అందిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని అయ్యప్పస్వాములు సద్వినియోగం చేసుకోవాలని బాజిరెడ్డి శనివారం ఓ ప్రకటనలో కోరారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
శబరిమల యాత్ర బస్సులపై ఎలాంటి డిపాజిట్ లేకుండా 10 శాతం రాయితీపై సూపర్ లగ్జరీ, డీలక్స్,ఎక్స్ప్రెస్ బస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదనపు సీట్ల కోసం ఇద్దరు గురుస్వాములతో పాటు.. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఇద్దరు వంట మనుషులు, 12 సంవత్సరాలు లోపు మణికంఠ స్వాములు, ఒక అటెండర్ కు ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు. శబరిమల యాత్ర బస్సును బుకింగ్ చేసిన గురుస్వామికి ప్రయాణం ఉచితం అని ప్రకటించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
ఈ ప్రత్యేక బస్సుల్లో ఆడియో, వీడియోతో పాటు మొబైల్ ఛార్జింగ్ సదుపాయం ఉంటుందని వివరించారు. మాలధారులు కోరుకున్న ప్రదేశం నుంచి వారు దర్శించాల్సిన అన్ని పుణ్యక్షేత్రాల వరకు బస్సులు నడుపుతామని వివరించారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
భక్తులు ముందస్తు రిజర్వేషన్, బస్సు అద్దె బుకింగ్ ల కోసం www.tsrtconline.in వెబ్ సైట్ ను సందర్శించాని సూచించారు. మరిన్ని వివరాలకు 040-23450033, 69440000 ఫోన్ నంబర్లను సంప్రదించాలని బాజిరెడ్డి తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)