తెలంగాణ ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్ అధికారి సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సంస్థ రూపు మార్చుకోవడానికి ఆయన అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. తద్వారా ప్రయాణికులకు ఆర్టీసీని మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.(ఫొటో: ట్విట్టర్)
2/ 5
తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా మూడు కొత్త ఆఫర్లను తీసుకువచ్చారు సజ్జనార్. ఆ ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
3/ 5
ఆఫర్ 1: హైదరాబాద్ జంట నగరాల్లో రూ.80కే ట్రావెల్ యాజ్ యూ లైక్ టికెట్లను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది తెలంగాణ ఆర్టీసీ. ఈ ఆఫర్ ఈ నెల 8 నుంచి 14 వరకు అందుబాటులో ఉండనుంది. వాస్తవానికి ట్రావెల్ యాజ్ యూ లైక్ టికెట్ ధర రూ.100.(ఫొటో: ట్విట్టర్)
4/ 5
ఆఫర్ 2: వరంగల్, హన్మకొండ జంట నగరాల్లోనూ ట్రావెల్ యాజ్ యూ లైక్ టికెట్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఆర్టీసీ. వాస్తవానికి ఈ టికెట్ ధర రూ.60 కాగా 8వ తేదీ నుంచి 14 వరకు రూ.50 కే కొనుగోలు చేసే అవకాశం కల్పించింది TSRTC.(ఫొటో: ట్విట్టర్)
5/ 5
ఆఫర్ 3: ఇంకా మరో బంపరాఫర్ ను ప్రకటించింది తెలంగాణ ఆర్టీసీ. మహిళా దినోత్సవం రోజున 60 ఏళ్లు పైబడిన మహిళలకు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. సంబంధిత మహిళలు ఆ రోజున ఏదైనా గుర్తింపు కార్డును కండక్టర్ కు చూపించి ఉచింగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు.(ఫొటో: ట్విట్టర్)