2. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI డేటా ప్రకారం 2019 మార్చిలో 79.95 కోట్ల యూపీఐ లావాదేవీల్లో రూ.1.33 లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి. 2018 మార్చిలో 17.80 కోట్ల లావాదేవీల్లో రూ.24,172 కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి. యూపీఐ లావాదేవీలు ఏ స్థాయిలో పెరిగాయో ఈ లెక్కలు చూసి అర్థం చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఓఎల్ఎక్స్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని అమ్మేవారిని టార్గెట్ చేస్తున్నారు మోసగాళ్లు. ఉదాహరణకు ఓ వ్యక్తి ఓఎల్ఎక్స్లో టీవీని రూ.10,000 అమ్మకానికి పెడితే సైబర్ నేరగాళ్లు కాంటాక్ట్ చేస్తారు. రూ.8,000 బేరం కుదుర్చుకుంటారు. అడ్వాన్స్‌గా రూ.4,000 ఇస్తామని నమ్మిస్తారు. అది కూడా గూగుల్ పే, ఫోన్ పే లాంటి యూపీఐ యాప్స్ ద్వారా పంపుతామని చెబుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఇక్కడే మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మీరు డబ్బులు పంపాలంటే పిన్ అవసరం కానీ... మీరు డబ్బులు రిసీవ్ చేసుకోవాలంటే పిన్ అవసరం లేదన్న విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఈ మోసాలను గుర్తించిన గూగుల్ పే... కొత్త నెంబర్ నుంచి మనీ రిక్వెస్ట్ వస్తే స్పామ్ అని అలర్ట్ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
9. మీరు ఒకవేళ కంప్యూటర్ ద్వారా లావాదేవీలు చేస్తున్నటైతే ఎట్టిపరిస్థితుల్లో Anydesk, Teamviewer, Screenshare లాంటి స్క్రీన్ షేరింగ్ యాప్స్ ఉపయోగించొద్దు. ఇతరులకు యాక్సెస్ ఇవ్వొద్దు. మొబైల్ ఫోన్లో కూడా స్క్రీన్ షేరింగ్ యాప్స్ వాడొద్దు. మీ స్క్రీన్ షేర్ చేస్తే ఓటీపీ ఇతరులు తెలుసుకోవడం చాలా సులువు. (ప్రతీకాత్మక చిత్రం)