రైల్వే ప్రయాణికులకు కచ్చితంగా వారి ట్రైన్ టికెట్లను ట్రైన్ మ్యాన్ యాప్ ద్వారానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే వెయిటింగ్ లిస్ట్ వచ్చిందని అనుకుందాం. ఇప్పుడు మీరు ట్రైన్ మ్యాన్ యాప్‌లోని ప్రిడిక్షన్ మీటర్ ద్వారా ఎంత వరకు టికెట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉందో తెలుసుకోవచ్చు.
వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ట్రైన్ టికెట్ చార్ట్ ప్రిపరేషన్ కన్నా ముందు కన్ఫర్మ్ కాకపోతే.. అప్పుడు మీకు ట్రిప్ అష్యూరెన్స్ అనేది మీకు లాస్ట్ మినిట్ ట్రావెల్ ఆప్షన్స్ చూపిస్తుంది. ప్యాసింజర్ టికెట్ ప్రిడిక్షన్ మీటర్ 90 లేదా ఆపై చూపిస్తే.. ట్రైన్ మ్యాన్ ట్రిప్ అష్యూరెన్స్ చార్జ్ రూ.1 వసూలు చేస్తుంది.