ఫిబ్రవరి 5వ తేదీ నుంచి జరగనున్న దురాజుపల్లి పెద్దగట్టు జాతర పోలీసు బందోబస్తు ఏర్పాట్లకు సంబంధించి ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. జాతర సందర్భంగా జాతీయరహదారిపై వాహనాల మళ్లింపు, జాతరకు వచ్చే వాహనాల పార్కింగ్ స్థలాలకు సంబంధించి రూట్ మ్యాపులను విడుదల చేశారు.