విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి ఆర్థిక స్థోమత లేని విద్యార్థులు ఎడ్యుకేషన్ లోన్ సాయంతో చదువుకోవచ్చు. కోర్సు ఫీజులు, ప్రయాణ ఖర్చులను తీర్చడంలో ఇవి మీకు సహాయపడతాయి. ప్రస్తుతం వివిధ బ్యాంకులు స్టడీ లోన్స్‌ను సులువుగా మంజూరు చేస్తున్నాయి. అందుకు అవసరమైన డాక్యుమెంట్లని సబ్మిట్ చేస్తే ఈజీగా పొందవచ్చు. Bankbazaar.com డేటా ప్రకారం, ప్రభుత్వ యాజమాన్యంలో కొన్ని బ్యాంకులు 7.3 శాతం కంటే తక్కువ వడ్డీ రేట్‌తో ఎడ్యుకేషన్ లోన్లను అందిస్తున్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ 7.25 శాతం వడ్డీ రేటుతో స్టడీ లోన్స్ అందిస్తోంది. ఏడు సంవత్సరాల రీపేమెంట్ వ్యవధితో రూ. 20 లక్షల లోన్‌పై ఈఎంఐ రూ.30,340గా ఉంటుంది. బ్యాంక్‌బజార్ డేటా ప్రకారం.. ప్రభుత్వ యాజమాన్యంలోని చిన్న తరహా బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్స్‌ను ఒకే వడ్డీ రేటుతో అందిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఇటీవల ఆర్బీఐ కీలక పాలసీ రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచడంతో రెపో రేటుతో ముడిపడి ఉన్న ఫ్లోటింగ్-రేట్ రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణ పరిస్థితులు ఇలానే కొనసాగితే, కొన్ని అంచనాల ప్రకారం.. ఆర్బీఐ బేసిక్ పాయింట్లను 50 వరకు పెంచే అవకాశం ఉంది. ఈ ప్రభావం ఎడ్యుకేషన్ లోన్స్‌పై పడనుంది. దీంతో బ్యాంకులు స్టడీ లోన్స్‌పై వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది.