Electric Scooters | మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఓలా, ఏథర్, హీరో ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్ వంటి కంపెనీలు అమ్మకాల్లో దుమ్మరేపుతున్నాయి. భారీ ఆఫర్లు, ఈజీగా లోన్, తక్కువ ఈఎంఐ ఆప్షన్లు వంటి వాటి వల్ల అమ్మకాలు భారీగా పెరిగాయని చెప్పుకోవచ్చు. దేశంలో జనాలు ఎక్కువగా కొంటున్న టాప్ 7 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏంటివో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.
బజాజ్ చేతక్ అమ్మకాలు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. అయితే ఇతర కంపెనీలతో పోలిస్తే మాత్రం చాలా తక్కువనే చెప్పుకోవాలి. బజజ్ చేతక్ అమ్మకాలు గత నెలలో 2,888 యూనిట్లుగా ఉన్నాయి. ఓలా వంటి కంపెనీలతో పోలిస్తే బజాజ్ చేతక్ అమ్మకాలు చాలా చాలా తక్కువనే చెప్పుకోవాలి. బజాజ్ చేతక్ ఏడో స్థానంలో నిలిచింది. కంపెనీ ఈ స్కూటర్‌ను మార్కెట్లో లాంచ్ చేసి చాలా కాలం అయ్యింది. కానీ అమ్మకాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి.