Best Mileage Bikes: రూ.70 వేలలోపు ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 7 బైక్స్ ఇవే!
Best Mileage Bikes: రూ.70 వేలలోపు ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 7 బైక్స్ ఇవే!
Mileage Bikes | మీరు ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ కోసం చూస్తున్నారా? అయితే మీకు పలు రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అందుబాటు ధరలో వీటిని కొనుగోలు చేయొచ్చు.
Top Mileage Bikes | మీరు కొత్త బైక్ కొనే ఆలోచనలో ఉన్నారా? అది కూడా బెస్ట్ మైలేజ్ టూవీలర్ కోసం చూసున్నారా? బడ్జెట్ ధరలో అంటే రూ. 70 వేల ధరలో అధిక మైలేజ్ ఇస్తున్న బైక్స్ ఏంటివో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.
2/ 9
బజాజ్ సీటీ 110 ఎక్స్ కూడా రెండు వేరియంట్ల రూపంలో లభిస్తోంది. ఈ బైక్ ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ. 59,104 నుంచి ఉంది. ఇందులో 115 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది లీటరుకు 104 కిలోమీటర్ల మేర మైలేజ్ ఇవ్వొచ్చు.
3/ 9
హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ కూడా ఉంది. తక్కువ ధరకే లభిస్తున్న మరో బైక్ ఇది. ఇది రెండు వేరియంట్ల రూపంలో లభిస్తోంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 59,990 నుంచి ప్రారంభం అవుతోంది. ఇందులో కూడా 97.2 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఈ బైక్ మైలేజ్ 83 కిలోమీటర్లు.
4/ 9
హీరో హెచ్ఎఫ్ 100 తక్కువ ధరకే లభిస్తోంది. ఈ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 56,968గా ఉంది. ఇది కేవలం ఒకే వేరియంట్ రూపంలో లభిస్తోంది. ఇందులో 97.2 సీసీ ఇంజిన్ ఉంటుంది. దీని మైలేజ్ లీటరుకు 83 కిలోమీటర్లు.
5/ 9
హోండా సీడీ 110 డ్రీమ్ బైక్ కూడా అధిక మైలేజ్ అందిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 71,133గా ఉంది. ఈ బైక్‌లో 109 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది లీటరుకు 74 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఛాన్స్ ఉంది.
6/ 9
బజాజ్ ప్లాటినా కూడా బెస్ట్ మైలేజ్ బైక్స్‌లో ఒకటిగా ఉంది. లైట్ వెయిట్, లాంగ్ మైలేజ్ బైక్ ఇది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 65,856 నుంచి ప్రారంభం అవుతోంది. ఇది లీటరుకు 90 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వొచ్చు. ఇందులో 102 సీసీ ఇంజిన్ ఉంటుంది.
7/ 9
అలాగే టీవీఎస్ స్పోర్ట్ బైక్ కూడా ఉంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 63,990 నుంచి ప్రారంభం అవుతోంది. ఇందులో 109 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఈ బైక్ లీటరుకు 75 కిలోమీరట్ల మైలేజ్ ఇవ్వొచ్చు.
8/ 9
టీవీఎస్ రేడియన్ బైక్ కూడా సూపర్ మైలేజ్ ఇస్తోంది. ఇది మూడు వేరియంట్ల రూపంలో లభిస్తోంది. దీని ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ. 59,925గా ఉంది. ఇందులో 109 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఈ బైక్ లీటరుకు 74 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వొచ్చు.
9/ 9
ఇకపోతే పైన పేర్కొన్న బైక్స్ మైలేజ్ గణాంకాలు అనేవి ఏఆర్ఏఐ ప్రకారం పేర్కొన్నవి. ప్రత్యేక పరిస్థితుల్లో ఈ మైలేజ్ ఇస్తారు. అయితే ఆన్‌రోడ్‌లో ఈ బైక్స్ మైలేజ్ వేరే విధంగా ఉండొచ్చు. అంటే తక్కువగా ఉంటుంది. అందువల్ల బైక్ కొనే వారు ఇప్పటికే అలాంటి బైక్స్ కొన్న వారి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం ఉత్తమం.