ఒకినావా డ్యూయల్ 100
డెలివరీ ఏజెంట్లలో డ్యూయల్ 100 ఎలక్ట్రిక్ స్కూటర్‌కు అధిక డిమాండ్ ఉంది. ప్రస్తుతం, స్కూటర్లు కంపెనీ అధికారిక వెబ్సైట్లో 'అవుట్ ఆఫ్ స్టాక్'ని చూపుతున్నాయి. అధిక డిమాండ్ కారణంగా Okinawa ప్రస్తుతం ఈ స్కూటర్‌ను 6 నెలల తర్వాత మాత్రమే డెలివరీని అందిస్తోంది. దీని ధర కేవలం రూ.79,813 ధర (ఎక్స్-షోరూమ్) మాత్రమే. 200 కిలోల లోడింగ్ సామర్థ్యం ఉంది. ఒక సారి ఛార్జ్ చేస్తే 149 కి.మీ రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా CX- డ్యూయల్ బ్యాటరీ
ఇండియాలో చాలా ఏళ్లుగా ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంచ్ చేస్తున్న కంపెనీ హీరో ఎలక్ట్రిక్. చాలా కాలం పాటు అమ్మకాల పరంగా అగ్రస్థానంలో కొనసాగింది. అయితే ఓలా ఎలక్ట్రిక్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఆప్టిమా CX - డ్యూయల్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‌లో అత్యంత పాపులర్ అయింది. దీని ధర రూ.85,190 (ఎక్స్-షోరూమ్). ఒక్కసారి ఛార్జ్ చేస్తే 140 కి.మీ రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
టీవీఎస్ ఐక్యూబ్
ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో టీవీఎస్ ఐక్యూబ్ ఒకటి. దీని ధర ప్రస్తుతం రూ. లక్ష (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అత్యంత -విశ్వసనీయ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా గుర్తింపు సొంతం చేసుకుంది. ఒక ఛార్జ్‌పై 100 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఇందులో 7-అంగుళాల డిజిటల్ స్క్రీన్, LED లైట్లు, HMI కంట్రోలర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)