మహీంద్రా ఇ వెరిటో కారు కూడా ఉంది. ఇది మహీంద్రా తొలి ఎలక్ట్రిక్ కారు. దీని రేటు రూ. 10.16 లక్షలుగా ఉంది. ఈ కారు రేంజ్ 120 కిలోమీటర్లు. టాప్ స్పీడ్ గంటకు 86 కిలోమీటర్లు. ఇకపోతే మహీంద్రా కంపెనీ ఎక్స్‌యూవీ 400 ఎస్‌యూవీని లాంచ్ చేసింది. అదిరే ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వీటి అమ్మకాలు త్వరలో ప్రారంభం కానున్నాయి.
పీఎంవీ ఈజ్ కారు చౌక ధరకే లభిస్తోంది. పీఎంవీ ఎలక్ట్రిక్ కపంనీ ఈ పీఎంవీ ఈజ్ ఎలక్ట్రిక్ కారును అందిస్తోంది. ఇది 2 సీటర్ మైక్రో కారు. దీని రేటు 4.79 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. ఇందులో 48 వీ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు వెళ్లొచ్చు. టాప్ స్పీడ్ గంటకు 70 కిలోమీటర్లు.
స్ట్రోమ్ ఆర్3 ఎలక్ట్రిక్ కారు కూడా ఉంది. ఇది కూడా 2 సీటర్ ఎలక్ట్రిక్ కారు. ఇది త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. దీని ధర కూడా రూ. 4.5 లక్షల రేంజ్లో ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. దీని రేంజ్ కూడా 200 కిలోమీటర్లు ఉండొచ్చు. ఇందులో జీపీఎస్ నావిగేషన్, ఆటో క్లైమెట్ కంట్రోల్, వాయిస్ కమాండ్స్, 7 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
టాటా టియాగో ఈవీ కూడా అందుబాటు ధరలోని కారుగా చెప్పుకోవచ్చు. ఇందులో పలు రకాల వేరియంట్లు ఉన్నాయి. దీని ఎక్స్‌షోరూమ్ రేటు రూ. 8.49 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. టాప్ వేరియంట్ ధర రూ. 11.79 లక్షలుగా ఉంది. ఈ కారు ఒక్కసారి చార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు వెళ్తుంది. సెకండ్ బ్యాటరీ ప్యాక్‌తో అయితే ఏకంగా 315 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంది. బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేాయాలని భావించే వారు ఈ ఐదు ఆప్షన్లను ఒకసారి పరిశీలించొచ్చు.