Money | ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకులు దుమ్మురేపుతున్నాయి. స్టాక్ మార్కెట్లో అదరగొడుతున్నాయి. భారీ రాబడిని అందిస్తున్నాయి. తక్కువ కాలంలోనే డబ్బులు పెట్టిన వారి పంట పండించాయి. అధిక రాబడిని అందించాయి. ఏ ఏ ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు గత ఆరు నెలల కాలంలో దుమ్మురేపే లాభాలు ఇచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.
యూకో బ్యాంక్ షేరు అదరగొడుతోంది. ఈ షేరు ధర గత ఆరు నెలల కాలంలో భారీ రాబడిని ఇచ్చింది. ఏకంగా 140 శాతం మేర పరుగులు పెట్టింది. అంటే మీరు ఆరు నెలల కిందట ఈ షేరులో రూ. లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు చేతికి రూ. 2 లక్షలకు పైగా వచ్చేవి. ఒక్కో షేరుకు ఇన్వెస్టర్లకు రూ. 16కు పైగా రాబడి పొందారు. ప్రస్తుతం ఈ షేరు రూ. 27 వద్ద కదలాడుతోంది.