1. బడ్జెట్, ఫైనాన్సింగ్: కారును కొనాలకున్నవారు ముందు వ్యాల్సూ ఫర్ మనీ ఆప్షన్ల గురించి ఆలోచించాలి. ప్రస్తుత పండుగ సీజన్లో కార్ల తయారీ సంస్థలు ఆకట్టుకునే ఆఫర్లను ప్రకటించాయి. వాటిల్లో సులభమైన కొనుగోలు పద్ధతిని ఎంచుకోవాలి. వినియోగదారులు మొత్తం నగదును ఒకేసారి చెల్లించి కొత్త కారు కొనడం మంచిది. కానీ ఇది అన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు. కొన్నిసార్లు ఫైనాన్స్ అవసరం కావచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆదాయ వ్యయాలకు సంబంధించిన బడ్జెట్ను రూపొందించుకోవాలి. వాస్తవిక బడ్జెట్ను రూపొందించడానికి నెలవారీ ఆదాయం, అద్దె, కిరాణా, యుటిలిటీ బిల్లులు, ఆరోగ్య బీమా.. వంటి ఖర్చులను బేరీజు వేసుకోవాలి. వాటిల్లో ఎక్కడ డబ్బు ఆదా చేసే అవకాశం ఉందో చూసుకొని, ఆ మేరకు కారు పేమెంట్ కోసం ఖర్చు చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)