Best Selling Motorcycles | మన దేశంలో టూవీలర్లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. మధ్య తరగతి ప్రజలు స్కూటర్ లేదా బైక్ ఏదో ఒకటి కచ్చితంగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో చాలా వెహికల్స్ ఉన్నాయి. వివిధ కంపెనీలు పలు రకాల స్కూటర్లను, బైక్స్‌ను తీసుకువచ్చాయి. అలాగే కొత్త కొత్త మోడళ్లను లాంచ్ చేస్తూ ఉంటాయి.
2 లక్షల యూనిట్లకు పైగా విక్రయం అవుతున్న బైక్ కేవలం హీరో స్ల్పెండర్ మాత్రమే. మరే ఇతర బైక్ కూడా ఈ రేంజ్ అమ్మకాలను కలిగి లేదు. దీని మార్కెట్ వాటా డిసెంబర్ నెలలో 35 శాతానికి పైగానే ఉంది. అలాగే డిసెంబర్ నెలలో హోండా సీబీ షైన్ మోడల్‌ను వెనక్కి నెట్టి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ రెండో స్థానాన్ని కైవశం చేసుకుంది.