ముంబై పుణె ఎక్స్‌ప్రెస్‌వే పై ఏకంగా 18శాతం మేర టోల్ రేట్లను మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట కార్పొరేషన్ పెంచింది. ఈ తాజా టోల్ ట్యాక్స్‌ల ప్రకారం ప్రైవేట్ కార్లపై రూ.50 మేర అదనపు భారం పడుతోంది. ఇదివరకు రూ.270గా ఉన్న టోల్ ట్యాక్స్ ఇప్పుడు రూ.320కి పెరిగింది. ముంబైలోకి ప్రవేశించే ముందు వాశి టోల్ ప్లాజా వద్ద అదనంగా రూ.40 చెల్లించాల్సి ఉంటుంది. బస్సులకు రూ.940, ట్రక్కులకు రూ.685 గా టోల్ ధరలు ఉన్నాయి.
బెంగుళూరు మైసూరు ఎక్స్‌ప్రెస్ వేపై ఎన్హెచ్ఏఐ 22 నుంచి 23శాతానికి టోల్ట్యాక్స్ని పెంచింది. నిడఘట్టా, బెంగుళూరు మధ్య ప్రయాణించడానికి కార్లు, వ్యాన్లకు సింగిల్ జర్నీకి రూ.135 టోల్గా ఉండేది. తాజా సవరణతో ఈ ధర రూ.165 కి పెరిగింది. రౌండ్ ట్రిప్‌కి రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. హెవీ వెహికిల్స్ సింగిల్ జర్నీకి రూ.270, రౌండ్ ట్రిప్‌కి రూ.405 చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
నేషనల్ హైవే 9పై చిజర్సా టోల్ ప్లాజా వద్ద లైట్ మోటార్ వెహికిల్స్‌కి రూ.165, 6 టైర్లున్న ట్రక్కులకు రూ.556, 10 టైర్లున్న ట్రక్కులకు రూ.605 విధిస్తున్నారు. మీ ప్రాంతాల్లోని ఆయా జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను తెలుసుకోవడానికి ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
https://tis.nhai.gov.in/tollplazasataglance.aspx?language=en# (ప్రతీకాత్మక చిత్రం)