22 carats Gold in Hyderabad: 22 క్యారట్ల బంగారాన్ని నగల తయారీలో వాడుతారు. సామాన్య ప్రజలు ఎక్కువగా దీనినే కొంటుంటారు. ఈ బంగారం 10 గ్రాముల ధర ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో రూ.49,300 వద్ద స్థిరంగా ఉంది. నిన్నటితో పోల్చితే ధరలో ఎలాంటి మార్పులేదు. తులం బంగారం ధర రూ.4,930గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
Silver Rates Today: కొన్ని రోజులుగా వెండి ధరలు దిగొస్తున్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,100కి దిగొచ్చింది. నిన్నటితో పోల్చితే రూ.900 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాాద్‌లో తులం వెండి రూ.721కి అందుబాటులో ఉంది. హైదరాబాద్‌తో పాటు ఏపిలోని విశాఖపట్టణం, విజయవాడ, చెన్నై, బెంగళూరు, కేరళలో వెండి ధరలు దాదాపు ఒకేలా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, జువెలరీ మార్కెట్లలో నగలకు డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)