దేశంలో బంగారం ధరలు తగ్గినా కూడా వెండి రేటు పైకి కదలడం గమనార్హం. గ్లోబల్ మార్కెట్లో మాత్రం ట్రెండ్ దీనికి భిన్నంగా ఉంది. అక్కడ బంగారం ధరలు పెరిగితే.. వెండి రేటు మాత్రం పడిపోయింది. పసిడి రేటు ఔన్స్‌కు 0.22 శాతం పైకి చేరింది. 1830 డాలర్ల వద్ద కదలాడుతోంది. వెండి రేటు ఔన్స్‌కు 0.29 శాతం తగ్గింది. 24.18 డాలర్ల వద్ద కదలాడుతోంది.
ఇకపోతే బంగారం, వెండి ధరలు కొత్త ఏడాదిలో భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం రేటు రూ. 62 వేలకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. అదేసమయంలో వెండి ధర అయితే ఏకంగా రూ. 80 వేలకు వెళ్లొచ్చని పేర్కొంటున్నారు. అంటే ఈ ఏడాది బంగారం ధరలు జిగేల్ మంటూ దూసుకుపోనున్నాయి. వెండి మెరుపులు మెరిపించబోతుంది. అందువల్ల బంగారం ధర తగ్గినప్పుడు కొనడం ఉత్తమం.