Gold and silver Prices Today: మన దేశంలో వెండి, బంగారం ధరలు నిత్యం మారుతుంటాయి. మార్కెట్లో పరిస్థితులని బట్టి తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి. అందుకే బంగారాన్ని కొనే వారు ప్రతి రోజులు ధరలను పరిశీలిస్తూ నిర్ణయాలు తీసుకుంటారు. మరి గురువారం (జనవరి 7)న మార్కెట్లో బంగారం, వెండి ధరలు ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.
బంగారం ధరలు ఆగస్టు నుంచి తగ్గుముఖం పట్టాయి. ఆగస్టు 17న 22 క్యారెట్ల బంగారం (10 గ్రా.) ధర రూ.51,670గా ఉంటే.. ప్రస్తుతం రూ.46,700గా ఉంది. అంటే 5 నెలల్లో రూ.3,500కి పైగా తగ్గింది పసిడి ధర. ఐతే డిసెంబరు 16 నుంచి మళ్లీ బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. పలు ప్రాంతాల్లో మళ్లీ 50 వేల మార్కును చేరుకున్నాయి.
బంగారం దూకుడు కంటిన్యూ: గత 38 రోజుల్లో అప్పుడప్పుడూ బంగారం ధరలు తగ్గినా... మొత్తంగా పెరుగుతూనే ఉన్నాయి. గత 6 రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,300 పెరిగింది. ఇది ఇలాగే కొనసాగుతుందనిన నిపుణులు అంటున్నారు. అందుకే బంగారం నగలు కొనుక్కోవాలనుకునేవారికి ఇప్పడు చాలా కష్టం. భవిష్యత్తులో కొనుక్కుందామంటే... అప్పుడు మరింత పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. ఐతే బంగారంపై పెట్టుబడులు పెడుతున్న ఇన్వెస్టర్లు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.