1. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా? ఐఆర్సీటీసీ తిరుమల తిరుపతి టూర్ ప్యాకేజీ అందిస్తోంది. రెండు రాత్రులు, మూడు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. (ప్రతీకాత్మక చిత్రం)
2. 'గోవిందం' పేరుతో ఐఆర్సీటీసీ రూపొందించిన టూర్ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతోపాటు తిరుచానూర్‌లో అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. స్లీపర్ లేదా థర్డ్ ఏసీ కోచ్‌లో తిరుపతి తీసుకెళ్తుంది ఐఆర్సీటీసీ. తిరుమల, తిరుచానూర్ వెళ్లేందుకు ఏసీ వాహనం ఏర్పాటు చేస్తుంది. ప్యాకేజీలో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, గైడ్ సర్వీస్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకునే టూరిస్టులు తిరుమలలో దర్శనం కోసం తప్పనిసరిగా ఒరిజినల్ ఐడీ కార్డు తీసుకెళ్లాలి. లేకపోతే తిరుమలలో దర్శనం సాధ్యం కాదు. పురుషులు తెల్ల ధోతీ, షర్ట్, కుర్తా, పైజామాతో, స్త్రీలు చీర, సల్వార్ కమీజ్‌తో దర్శనానికి వెళ్లాల్సి ఉంటుందని ఐఆర్సీటీసీ ప్యాకేజీలో వివరించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఐఆర్సీటీసీ గోవిందం టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.3910. స్లీపర్, థర్డ్ ఏసీలకు ప్యాకేజీ ధరలు వేర్వేరుగా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఐఆర్సీటీసీ తిరుమల టూర్ మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్‌లో తిరుపతి రైల్ ఎక్కాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. రెండో రోజు ఉదయం 6 గంటలకు తిరుపతి చేరుకుంటారు. హోటల్లో ఫ్రెషప్ అయిన తర్వాత తిరుమలకు తీసుకెళ్తారు. శీఘ్రదర్శనంలో శ్రీవారిని దర్శించుకోవాలి. దర్శనం తర్వాత తిరుపతి చేరుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
8. తిరుపతి చేరుకున్నాక మధ్యాహ్నం భోజనం తర్వాత సమయం ఉంటే తిరుచానూర్ ఆలయ సందర్శన ఉంటుంది. హోటల్ నుంచి చెక్ ఔట్ చేసిన తర్వాత సాయంత్రం 5 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
9. సాయంత్రం 06:25 గంటలకు నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్కితే ఉదయం 06:25 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)