బంగారం నాణ్యత సరిచూసుకోండి... హాల్ మార్క్ తప్పనిసరి : 24 కేరట్ల బంగారాన్ని స్వచ్ఛమైన బంగారం అంటారు. అయితే బంగారు దుకాణాల్లో మనం కొనే బంగారు ఆభరణాలు సాధారణంగా 22 కేరట్ల బంగారం ఉంటుంది. నాణ్యతను బట్టి బంగారం 18, 14,12,10 కేరట్లలో దొరుకుతుంది. అయితే 22 కేరట్ల బంగారంలో 91.6 శాతం బంగారం ఉంటుంది. దీన్నే 916 బంగారం అంటారు.
18 కేరట్ల బంగారంలో కేవలం 75 శాతం బంగారం మాత్రమే ఉంటుంది. కొంత మంది దుకాణదారులు 22 కేరట్ల బంగారం అని చెప్పి 18కేరట్ల బంగారంతో చేసిన నగలు అంటగడుతుంటారు. అలాంటప్పుడు మనం కొనే నగలపై తప్పనిసరిగా బీఐఎస్ హాల్ మార్క్ ఉందా లేదా అనేది సరిచూసుకోవాలి. 916 బీఐఎస్ హాల్ మార్క్ ఉన్న నగలనే వర్తకుల నుంచి డిమాండ్ చేసి కొనుగోలు చేయాలి.
బంగారంతో సమానంగా...రశీదును భద్రపరుచుకోండి... ఇక అన్నింటి కన్నా ముఖ్యమైనది రశీదు. బంగారు ఆభరణాలు కొన్న తర్వాత రశీదు జాగ్రత్తగా భద్రపరుచుకోవడం తప్పనిసరి. కిరాణా సరుకుల బిల్లు రశీదులా తీసిపారేయకుండా, అత్యంత జాగ్రత్తగా దాచుకోవాలి. ఎందుకుంటే మున్ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా రశీదు ఉంటే జవాబుదారీతనం ఉంటుంది.