జీవితంలో ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని చాలా మంది కలలు కంటుంటారు. సౌకర్యవంతమైన ప్రయాణం, తక్కువ సమయంలోనే గమ్యం చేరుకునే అవకాశం ఉండటం వల్ల విమాన ప్రయాణాలకు క్రేజ్ ఏర్పడింది. అయితే విమాన ప్రయాణం ఖర్చుతో కూడుకున్నది. అందుకే, సామాన్య, మధ్య తరగతి ప్రజలు విమాన ప్రయాణమంటే వెనకడుగు వేస్తుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రయాణానికి నెలల ముందే టికెట్ బుక్ చేసుకోండి
ఏ పనికైనా ముందుస్తు ప్లానింగ్ చాలా అవసరం. ప్రయాణం విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. మీరు మీ ప్రయాణాన్ని ఒక నెల లేదా రెండు నెలల ముందుగానే ప్లాన్ చేసి, ముందుగానే టికెట్లను బుక్ చేసుకుంటే చాలా ఖర్చు తగ్గుతుంది. ఒకవేళ, ప్రయాణం దగ్గర పడే సమయానికి టికెట్ బుక్ చేసుకోవాలని ప్రయత్నిస్తే ఎక్కువ ధరకు టికెట్ కొనాల్సి వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇన్‌కాగ్నిటో మోడ్ ఆన్ చేయండి
మీరు ఒక వెబ్సైట్లో విమాన టిక్కెట్ ధరను చెక్ చేసినప్పటికీ.. బుకింగ్ ఆలస్యం చేస్తే పెరిగిన ధరలలోనే బుక్ చేసుకోవాల్సి వస్తుంది. దీన్ని నివారించడానికి, ఇన్‌కాగ్నిటో మోడ్‌లోనే బ్రౌజ్ చేయండి. లేదా బ్రౌజింగ్ పూర్తి చేసిన తర్వాత మీ కుక్కీలను క్లియర్ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
వివిధ వెబ్సైట్లలో టికెట్ ధరలను పోల్చండి
మీరు మీ విమాన టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు, వివిధ టికెట్ బుకింగ్ వెబ్సైట్లలో ధరలను చెక్ చేసుకోండి. ఆయా వెబ్సైట్లలో ఎయిర్‌లైన్స్ సంస్థల టికెట్ ధరలను సరిపోల్చండి. తద్వారా, ఏ ఎయిర్‌లైన్స్ సంస్థ తక్కువ ధరకే టికెట్లను విక్రయిస్తుందనేది తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
ఎయిర్‌లైన్ వెబ్సైట్లో బుక్ చేసుకోండి
థర్డ్-పార్టీ వెబ్సైట్లు కళ్లు చెదిరే ఆఫర్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. కానీ, ఇలా ధర్డ్ పార్టీ వెబ్సైట్ల కంటే ఎయిర్‌లైన్ వెబ్సైట్ ద్వారా మీ టిక్కెట్లను బుక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే, థర్డ్ పార్టీ వెబ్సైట్ల కంటే ఎయిర్‌లైన్స్ అధికారిక వెబ్సైట్లలో ఎక్కువ డీల్స్ పొందవచ్చు. అంతేకాదు. మీరు సర్వీస్ ఛార్జీల నుంచి మినహాయింపు పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)