అందువల్ల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి అని భావిస్తారు. పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్న వారు, టర్మ్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం అదనపు ఖర్చుగా చెబుతారు. అయితే సింగిల్‌గా ఉన్నవారు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం మేలు. అందకు తగిన కారణాలు ఉన్నాయి. సింగిల్స్ ఎందుకు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయాలనే మూడు కారణాలను పరిశీలిద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
ఆర్థికంగా మీపై ఆధారపడిన వారు ఉన్నారా?
పెళ్లి చేసుకోకుండా ఒకరు సింగిల్‌గా ఉన్నంత మాత్రాన వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు లేరని కాదు. బహుశా పిల్లలతో సింగిల్ పేరెంట్ అయి ఉండవచ్చు. లేదా పదవీ విరమణ చేయబోతున్న తల్లిదండ్రులు ఉండవచ్చు, అదే విధంగా జీవించడానికి అవసరమైన డబ్బు కోసం ఆధారపడిన తోబుట్టువులు కూడా ఉండే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
తీర్చాల్సిన అప్పులు ఉంటే..
కొందరు గృహ రుణాలు తీసుకుని ఉండవచ్చు, లేదా చిన్న తోబుట్టువులు లేదా పిల్లల కోసం తీసుకున్న విద్యా రుణాలను తీర్చాల్సిన బాధ్యతలు ఉండవచ్చు. ఇలాంటి బాధ్యతలు పూర్తి కాక ముందే ఒకరు మరణిస్తే ఈ రుణాల భారం కుటుంబ సభ్యులపై పడుతుంది. వారు రుణాన్ని తిరిగి చెల్లించే ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబాన్ని ఒత్తిడితో కూడిన పరిస్థితులలో ఉంచకుండా, రుణాలు/బాధ్యతల భారం ప్రియమైన వారిపై పడకుండా చూసుకోవడానికి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
కలల విషయంలో రాజీ అవసరం లేదు
పిల్లలు పెరిగే కొద్దీ వారికి మంచి విద్యను అందించాలని, ఉత్తమ భవిష్యత్తును ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కొన్ని స్వల్పకాలంలో తీరగా.. మరికొన్నింటికి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. ఇలాంటి వాటిల్లో విదేశీ విశ్వవిద్యాలయంలో చదివించడం, ప్రఖ్యాత సంస్థ నుండి కొంత శిక్షణ పొందడం వంటివి ఉంటాయి. పిల్లలు వారి కలలను సాధించడాన్ని చూడటానికి ఎప్పటికీ ఉంటారనే గ్యారెంటీ లేదు. తల్లిదండ్రులు లేనప్పుడు పిల్లలు వారి కలలపై రాజీ పడకూడదనుకుంటే, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం గురించి ఆలోచించాలి. ఇది వారికి ఆర్థిక వనరులను అందిస్తుంది, వారు తమ కలలను నెరవేర్చుకోవడంలో రాజీ పడాల్సిన అవసరం ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)
టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది వివాహితులు, పిల్లలు ఉన్నవారికి ఎంత విలువైనదో అవివాహితులకు కూడా అంతే విలువైనది. ఒంటరి, పెంపుడు తల్లిదండ్రులు అయితే, దూరమైనప్పుడు పిల్లలు తమ కలల విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని టర్మ్ ఇన్సూరెన్స్ భరోసా ఇస్తుంది. రుణాలు/బాధ్యతలను కూడా కవర్ చేస్తుంది. ఒకరు లేనప్పుడు వారిపై ఆధారపడిన వారికి ఆర్థిక రక్షణ ఉండేలా చూస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)