అలోవెరా మొక్కల పెంపకం: భూమి మీద మనిషి కంటే ముందే పుట్టిన ఎన్నో రకాల మొక్కలు మానవుడికి ఎన్నో ప్రయోజనాలు ఇచ్చే సిరులే. కానీ వాటిని మనం గుర్తించం. మనం రోజు వాటిని చూస్తుంటాం. కానీ అవి మనకు ఆరోగ్యాలనిస్తాయనే విషయం తెలియదు. అయితే ఇక్కడ అలోవెరా లేదా కలబంద వ్యాధులకు నివారిణిగా ఉపయోగపడుతుంది. కలబంద రసం చర్మాన్ని యవ్వనంగా, అందంగా ఉంచుతుంది. ఇటువంటి మొక్కలను పెంచడం ద్వారా మంచి అర్జించొచ్చు. దీనికి ఎక్కువగా పెట్టుబడి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. దీనిని చేపల పెంపకం, బ్యాంబో సాగు ద్వారా కూడా డబ్బులు సంపాదించొచ్చు.
పుట్టగొడుగుల పెంపకం: ఇంటి వద్దనే పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించొచ్చు. మీరు కేవలం రూ.5 వేలతో కూడా ఈ బిజినెస్‌ను చిన్న స్థాయిలో స్టార్ట్ చేయొచ్చు. డిమాండ్ బాగుంటే భారీ స్థాయిలో పుట్టగొడుగులు సాగు చేస్తే సంవత్సరానికి రూ.లక్షల్లో ఆదాయం గడించొచ్చు. తర్వాత డిమాండ్ ఆధారంగా విస్తరించుకోవచ్చు. దీనికి మీకు ఎలాంటి స్పెషల్ ట్రైనింగ్ అవసరం లేదు. నెల రోజుల్లోనే పుట్టగొడుగులు పెరుగుతాయి.
కూరగాయల వ్యాపారం: ప్రతీ రోజు మనం మార్కెట్ కు వెళ్లి కూరగాయాను కొంటూ ఉంటాం. కానీ వారు విక్రయించే కూరగాయలు రైతుల వద్ద తెచ్చుకొని మనకు ఎక్కువ ధరకు విక్రయిస్తుంటారు. రైతలు వాళ్లకు తక్కువ ధరకు ఇస్తారు. ఇలా రెండు, మూడు చేతులు మారి.. కూరగాయలు అమ్మే వ్యాపారస్తుడి వద్దకు వస్తాయి ఆ కూరగాయలు. వీటి ద్వారా కూడా ఎక్కువగా డబ్బులు సంపాదించవచ్చు. లేదంటే.. మీరు రైతలు అయి ఉండి.. భూమి ఉంటే.. అందులో కూరగాయలను పండించి వ్యాపారులకు విక్రయించొచ్చు. దీని ద్వారా కూడా బోలెడు రాబడి ఉంటుంది.
కోళ్ల వ్యాపారం: ప్రస్తుతం చాలామంది పౌల్ట్రీ ఫాం(కోళ్ల ఫాం) పెట్టి.. చిన్న చిన్న కోడి పిల్లలను తెచ్చి.. అందులో పెంచుతారు. ఇలా రెండు నుంచి మూడు నెలల వరకు అవి పెరిగిన తర్వాత వాటిని విక్రయిస్తారు. దీనికి పెట్టుబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీని ద్వారా నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు సంపాదించవచ్చు. కానీ కోళ్ల ఫాంకు తగిన ప్రదేశం కావాలి. ఎగుమతికి .. దిగుమతికి అనుకూలంగా ఉండేవిధంగా చూసుకోవాలి. దానా ఖర్చులను మధ్యలో చూసుకోవాల్సి ఉంటుంది.
పాల వ్యాపారం: దీని ద్వారా ఎక్కువ మొత్తంలో సంపాదించవచ్చు. ప్రస్తుతం మార్కెట్ ప్యూర్ మిల్క్ ఎక్కడా దొరకడం లేదు. ఎక్కడ చూసినా కల్తీ మాయ అయిపోయింది. ఇటువంటి సమయంలో మనం ఆవు లేదా గేదె కొనుగోలు చేసి వీటి ద్వారా పాల వ్యాపారం చేయొచ్చు. మీరు రెండు ఆవులు లేదా 2 గేదెలు కొనుగోలు చేసి వాటి పాలను విక్రయించి ప్రతి నెలా ఆదాయం పొందొచ్చు. గేదె కొనాలంటే రూ.50 వేల నుంచి రూ.60 వేలు కావాలి. అదే ఆవు అయితే రూ.30 వేలు ఖర్చు అవుతుంది.
పూల వ్యాపారం: ఫ్లవర్ బిజినెస్ కూడా ప్రారంభించొచ్చు. పెళ్లిళ్లు లేదంటే ఏదైనా కార్యక్రమాలకు పూలను డెలివరీ చేయొచ్చు. ఆన్లైన్లో కూడా పూల కోసం ఆర్డర్లు తీసుకోవచ్చు. వీటిని డెలివరీ చేయొచ్చు. పండులగ సమయంలో వీటికి ఎనలేని డిమాండ్ ఉంటుంది. ఈ బిజినెస్ ను ఒక మంచి ఆలోచనతో మొదలు పెడితే.. విజయవంతం కావచ్చు. పెట్టుబడి చాలా తక్కువగా ఉంటుంది.