దేశంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ బ్యాంక్ ఖాతా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఎలాంటి మినిమమ్ డిపాజిట్ లేకుండా జీరో అకౌంట్ ను ఓపెన్ చేసుకోవచ్చని జన్ ధన్ యోజన ఫథకాన్ని కేంద్ర ప్రభుత్వం 15 ఆగస్టు, 2014న ప్రారంభించారు. ఇది 28, ఆగస్టు 2014లో అమలులోకి వచ్చింది. చాలామంది జన్ ధన్ యోజన పథకం కింద ఖాతాలను తెరిచారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ లాంటివి జిరాక్స్ సమర్పించాలి. అకౌంట్ ఓపెన్ కు ఎలాంటి రుసుము వసూలు చేయరు. ఒక వేళ ఖాతాదారుడు ప్రమాదానికి గురయితే క్లయిమ్ కోసం క్లెయిమ్ ఫామ్, డెత్ సర్టిఫికెట్, ప్రమాదం జరిగినట్టు ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం రిపోర్ట్, ఆధార్ కార్డ్ వివరాలు సబ్మిట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)