గృహాలు(Home) కొనుగోలు చేస్తున్న వారికి ఇప్పటి వరకు అందిన అదనపు పన్ను రాయితీ రూ.1.5 లక్షలు ఇకపై అందదు. ఈ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అందరికీ ఇళ్లు పథకం కింద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ (Income Tax Act) 1960 సెక్షన్ 80 EEA కింద ఇప్పటి వరకు ఈ పన్ను మినహాయింపు(Tax Benefit) కల్పించారు. గత యూనియన్ బడ్జెట్లో 2022-2023 సంవత్సరానికి ఈ పన్ను మినహాయింపును కేంద్ర ప్రభుత్వం వర్తింపజేయలేదు. ఈ పన్ను రాయితీ 2019-2022 ఏడాదికి మాత్రమే వర్తిస్తుంది. గృహాలు కొనుగోలు చేస్తున్న వారికి ఇకపై పన్ను రాయితీ పొందే అవకాశం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
సెక్షన్ 24(B) కింద రూ.2 లక్షల కంటే ఎక్కువగా పన్ను రాయితీ అందుకొన్నవారు ఇల్లు కోసం తీసుకున్న హోమ్ లోన్‌పై చెల్లించే వడ్డీకి సెక్షన్ 80EEA కింద రూ.1.5 లక్షల అదనపు తగ్గింపును పొందే అవకాశం కల్పిస్తున్నారు. ఇలా సెక్షన్ 24(B), 80EEA కింద హౌసింగ్ లోన్‌పై చెల్లించే వడ్డీపై ఒక వ్యక్తి గరిష్ఠంగా రూ.3.5 లక్షల మినహాయింపును క్లెయిమ్ చేసుకొనే వీలు ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే కొన్ని నిబంధనల కిందకు వచ్చిన వ్యక్తులు మాత్రమే ఈ ప్రయోజనాలను అందుకోగలరు. మొదటిది.. కచ్చితంగా 2019 ఏప్రిల్ 1, 2022 మార్చి 31వ తేదీ మధ్య రుణం తీసుకొని ఉండాలి. రెండోది.. హౌసింగ్ స్టాంపు డ్యూటీ విలువ రూ.45 లక్షలకు మించకూడదు. మూడోది.. ఈ ప్రయోజనాన్ని పొందుతున్న వ్యక్తికి రుణం మంజూరు చేసిన తేదీనాటికి మరే ఇతర ఇంటి ఆస్తి ఉండకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)
దీనిపై ITR ఫైలింగ్ వెబ్సైట్ Tax2win.in CEO అభిషేక్ సోనీ మాట్లాడుతూ.. ‘2022 మార్చి 31వ తేదీ లేదా అంతకు ముందు హోమ్ లోన్ పొందుతున్న వ్యక్తి సెక్షన్ 80EEA ప్రకారం ఈ మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకసారి రుణం మంజూరు అయితే.. భవిష్యత్ ఆర్థిక సంవత్సరాల్లో హోమ్ లోన్ పూర్తిగా తిరిగి చెల్లించే వరకు ఈ మినహాయింపును క్లెయిమ్ చేయగలరు.’ అని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)
వడ్డీ రాయితీలపై ముంబైకి చెందిన పెట్టుబడి, పన్ను నిపుణుడు బల్వంత్ జైన్ మాట్లాడుతూ.. ‘సెక్షన్ 80EEA కింద వడ్డీ రాయితీ ప్రయోజనం పొందాలనుకునే వారు ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సెక్షన్ 80 EEA అర్హత ప్రమాణాలకు సరిపోయే ఇంటిని కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకొని ఉంటే.. గడువు ముగిసేలోపు హోమ్ లోన్ ప్రక్రియ పూర్తి చేసుకొని, లోన్ మంజూరు అయ్యేలా చూసుకోవాలి. గడువు పూర్తయిన తర్వాత అయినా నగదు అందుకోవచ్చు. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు.’ అని వివరించారు. (ప్రతీకాత్మక చిత్రం)