Fixed Deposits | ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ నైనిటాల్ బ్యాంక్ తాజాగా అదిరిపోయే శుభవార్త అందించింది. బ్యాంక్ స్థాపించి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కస్టమర్లకు ప్రత్యేకమైన గిఫ్ట్ అందించింది. రెండు కీలక నిర్ణయాలు తీసుంది. దీంతో బ్యాంక్ కస్టమర్లకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు.
నైనిటాల్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను గమనిస్తే.. 7 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్డీలపై 3.25 శాతం వస్తుంది. 46 రోజుల నుంచి 179 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 4.25 శాతం వడ్డీ పొందొచ్చు. 180 రోజుల నుంచి 270 రోజుల ఎఫ్డీలపై వడ్డీ రేటు 4.95 శాతంగా ఉంది. 270 రోజుల నుంచి ఏడాదిలోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై అయితే 5.05 శాతం వడ్డీ వస్తుంది.